బీజేపీ నేత మల్లారెడ్డి హత్య కేసులో ఐదుగురు అరెస్ట్: మరో ఆరుగురి కోసం గాలింపు

Published : Mar 02, 2022, 12:19 PM ISTUpdated : Mar 02, 2022, 01:04 PM IST
బీజేపీ నేత మల్లారెడ్డి హత్య కేసులో ఐదుగురు అరెస్ట్: మరో ఆరుగురి కోసం గాలింపు

సారాంశం

గత నెల 18వ తేదీన  బీజేపీ నేత మల్లారెడ్డి హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు ప్రకటించారు.

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని Chityala వద్ద BJP  నేత Malla Reddy  హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు నిందితుల కోసం Police గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన వత్సవాయి  మండలం చిట్యాల వద్ద మల్లారెడ్డిని దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసులో హత్య కేసులో మొత్తం 11 మంది నిందితులుండగా వారిలో ఐదుగురు నిందితులను Arrest  చేశామని పోలీసులు తెలిపారు. మరో ఆరుగురు నిందితులను  అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు ప్రకటించారు.మల్లారెడ్డి హత్యకు రాజకీయ కోణం లేదని పోలీసులు తెలిపారు. 

మల్లా రెడ్డి హత్య కేసులో స్థానిక ఎమ్మెల్యే వియ్యంకుడు పుల్లారెడ్డి పాత్రపై విచారణ జరపాలని బీజేపీ నేతలు గతంలో డిమాండ్ చేశారు. పుల్లారెడ్డి ఆగడాలను ఎదిరిస్తున్నాడనే అక్కసుతో మల్లారెడ్డిని లారీతో ఢీ కొట్టి హతమార్చారని బీజేపీ గతంలో ఆరోపించింది. ఈ విషయమై పోలీసులు వివరణ ఇచ్చారు. 

గత మాసంలోనే మల్లారెడ్డి హత్య కేసులో అదుపులోకి తీసుకొన్న వారికి ఈ హత్యతో సంబంధం లేదని పోలీసులు గుర్తించారు. హత్యకు వారు కొరియర్లుగానే పనిచేశారని పోలీసులు చెప్పారు. దీంతో ఈ హత్య కేసులో నిందితులుగా 11 మందిని గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు.  కృష్ణా జిల్లా పోలీసులు ఈ హత్య కేసుకు సంబంధించి మీడియాకు నోట్ విడుదల చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ | Asianet News Telugu