ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను ట్రాప్ లోకి దింపాడో వివాహితుడు.. ఆమెను నమ్మించి, లాడ్జికి తీసుకువెళ్లి.. మద్యం తాగించాడు. ఆ తరువాత ఆమెను వ్యభిచారకూపంలోకి దింపాలని ప్రయత్నించాడు
గుంటూరు : ప్రేమ పేరుతో minor girl (16)ను ట్రాప్ చేసి prostitutionలోకి దించబోయారు. బాలిక చాకచక్యంగా తప్పించుకుని dial 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మంగళగిరి డీఎస్పీ రాంబాబు మంగళవారం విలేకరులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరి గుట్టకు చెందిన కంసాని రాజేష్ వివాహం చేసుకుని guntur జిల్లా మంగళగిరిలోని కొత్తపేటలో నివాసం ఉంటున్నాడు.
కొద్ది రోజులగా రాజేష్ మంగళగిరిలోని పార్కు రోడ్డులో ఓ బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. గత నెల 22న రాత్రి రాజేష్ తన బంధువులు అవినాష్, వినోద్ సహాయంతో బాలికను కారులో యాదగిరిగుట్ట తీసుకువెళ్లి ఓ లాడ్జీలో ఉంచాడు. అక్కడ మద్యం తాగించి బాలికను అవినాష్ లోబర్చుకున్నాడు. రాజేష్ బంధువు సిరి వ్యభిచారం నిర్వహిస్తుండగా ఆ బాలికను ఆ కూపంలోకి దించాలని చూశారు.
దీన్ని గ్రహించిన బాలిక తప్పించుకుని డయల్ 100కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బృందాలుగా ఏర్పడి రాజేష్, అవినాష్, వినోద్, సిరిని అరెస్ట్ చేసి.. బాలికను రక్షించారు. బాలిక కనిపించకుండా పయిన రోజునే ఆమె తల్లిదండ్రులు మంగళగిరిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ చెప్పారు. నింితులను అరెస్ట్ చేసిన సిబ్బందికి అర్బన్ ఎస్పీ రివార్డు ప్రకటించారు. సమావేశంలో సీఐ భూషణం, ఎస్ ఐలు నారాయణ, మహేంద్ర పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఇలాంటి కీచకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బాలికలు, విదేశీయులు సహా 200 మందికి పైగా womenను బెదిరించి వారి nude photsను Porn websitesకు విక్రయించిన కీచకుడిని ఢిల్లీ పోలీసులు arrest చేశారు. అతడి లాప్టాప్ లో ఏకంగా నాలుగువేల నగ్న ఫోటోలు చూసి విస్తుపోయారు. మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబీఏ చదివి.. ఓ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలో ఉద్యోగం చేస్తున్న నిందితుడు మోహిత్ శర్మ (33) ఈ అక్రమ దందా సాగిస్తున్న తీరును ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ మహిళ తనను బెదిరించి, నగ్న చిత్రాలు తీసుకుందని 2020 సెప్టెంబర్, 2021 జూన్ లో డిల్లీ సైబర్ సెల్ పోలీసులకు ఆన్లైన్ ద్వారా రెండు ఫిర్యాదులు అందాయి. వాటిపై ఇంటిలిజెంట్ అండ్ ఆపరేషన్స్ విభాగం రంగంలోకి దిగింది. ఇంస్టాగ్రామ్ ఐడిని, దానిని సృష్టించేందుకు ఉపయోగించిన ఈమెయిల్ ఐడిని ట్రాక్ చేసింది. నోయిడాలోని ఓ ఇంటి నుంచే ఇదంతా జరిగిందని గుర్తించింది.
ఆ తర్వాత ఏసిపి రామన్ లాంబా, ఇన్ స్పెక్టర్ అరుణ్ త్యాగి బృందం ఆ ఇంటికి వెళ్లగా.. మోహిత్ శర్మ ఉన్నాడు. ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన వైఫై హ్యాక్ అయ్యిందని, ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశానని.. అని మొదట బుకాయించ్చాడు. అయినా పోలీసుల బృందం అతని ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నింటినీ పరిశీలించగా అతడి నిర్వాకం బయటపడింది.