ఎన్ని రోజులుంటావ్, ఎక్కడి నుండి వచ్చావ్: నెల్లూరు ఎస్పీపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సంచలనం

By narsimha lode  |  First Published Jan 18, 2021, 7:08 PM IST

నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
 


కోవూరు: నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.నెల్లూరు జిల్లాలో సోమవారం నాడు జరిగిన ఓ సభలో ఎమ్మెల్యే  ఎస్పీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  డీసీఎంఎస్ ఛైర్మెన్ పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై కేసు పెట్టకుండా వదిలేయడంపై ఆయన మండిపడ్డారు.

టీడీపీకి చెందిన మాజీ మంత్రి సూచనతో కేసు నమోదు చేయవద్దని స్థానిక పోలీసులకు ఎస్పీ సూచించాడని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. ఎవరో టీడీపీ నేతలు ఫోన్ చేస్తే కేసు రిజిస్టర్ చేయవద్దని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.ఏ గవర్నమెంట్ అనుకొంటున్నారు....? బాగుండదు.. తమాషాలు పడొద్దు.. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు.

Latest Videos

undefined

రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడ ఇలాగే జరుగుతోందా ...? ఎస్పీ అనుమతి లేనిదే అట్రాసిటీ కేసులు పెట్టొద్దా? ఈ కేసు పెడితే తప్పేముంది? కేసు రిజిష్టర్ చేశాక డీఎస్పీ వచ్చి విచారణ చేస్తారు. తప్పని తేలితే కేసును కొట్టేస్తారని ఎమ్మెల్యే చెప్పారు.

ఎక్కడి నుండి వచ్చావ్ నువ్వు... కేసు రిజిస్టర్ చేయవద్దని చెప్పడానికి నీకు అధికారం ఏముందని ఆయన ప్రశ్నించారు. నీకు రూల్స్ ఎవరు నేర్పారు అంటూ వ్యాఖ్యానించారు.ఇంకో నెల ఉంటావో.. రెండు నెలలు ఉంటావో ఉన్నని రోజులు శుద్దంగా ఉండి చివరి రోజుల్లోనైనా మంచి పేరు తెచ్చుకొని వెళ్లాలని ఎమ్మెల్యే హితవు పలికారు.ఎవరు అనుకొంటున్నాడో ఎక్కడి నుండి వచ్చాడో మన కర్మ కొద్దీ ఈ జిల్లాకు వచ్చాడని ఆయన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
 

click me!