చంద్రబాబు డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నారు: జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్

By narsimha lode  |  First Published Oct 13, 2023, 1:14 PM IST


చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  కోస్తాంధ్ర జిల్లాల జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ చెప్పారు.



రాజమండ్రి: చంద్రబాబు డీ హైడ్రేషన్ తో బాధపడుతున్నారని  కోస్తాంధ్ర  జైళ్ల శాఖ  డీఐజీ రవికిరణ్ చెప్పారు.

శుక్రవారంనాడు ఓ తెలుగు న్యూస్ చానెల్ తో  కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ మాట్లాడారు. డీ హైడ్రేషన్ తో బాధపడుతున్నందున చంద్రబాబు ఓఆర్ఎస్ వాడుతున్నారని జైళ్ల శాఖ డీఐజీ  రవికిరణ్ తెలిపారు.  నిబంధనల ప్రకారంగానే తాము పనిచేస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ చెప్పారు. దేశంలోని ఏ జైలులో కూడ  ఏసీలు లేవన్నారు. రాజమండ్రి జైలులో సుమారు రెండువేల మంది ఖైదీలున్నారన్నారు. ఈ ఖైదీల్లో పలువురికి పలు అనారోగ్య సమస్యలున్నాయన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

Latest Videos

undefined

చంద్రబాబుకు తలెత్తిన అనారోగ్య సమస్యలపై  వైద్యులతో  ట్రీట్ మెంట్ ఇప్పించామన్నారు.  చంద్రబాబు ఆరోగ్యంపై  ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతుందని  ఆయన  అభిప్రాయపడ్డారు.  జైలులో చంద్రబాబు భద్రత గురించి ఆందోళన కూడ అవసరం లేదని  డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు.

జైలులో ఉన్న వైద్యులు చంద్రబాబును ప్రతి రోజూ  చెక్ చేస్తున్నారన్నారు.  డీ హైడ్రేషన్ కు సంబంధించి ట్రీట్ మెంట్ ఇచ్చారన్నారు.  స్కిన్ ఎలర్జీకి సంబంధించి కూడ మందులు అందించినట్టుగా చెప్పారు. 

రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ వచ్చిందని వైద్యులు తెలిపారన్నారు. ఈ విషయమై జైలులో ఉన్న స్కిల్ స్పెషలిస్టు చంద్రబాబుకు ట్రీట్ మెంట్ ఇచ్చారన్నారు. రాజమండ్రి జీజీహెచ్‌లో స్కిన్ స్పెషలిస్ట్ కూడ వచ్చి చంద్రబాబును పరీక్షించినట్టుగా రవికిరణ్ వివరించారు. జైలులోని డాక్టర్  ట్రీట్ మెంట్ కు కొనసాగింపుగా మరిన్ని సూచనలు చేశారని రవికిరణ్ తెలిపారు.  

చంద్రబాబు శరీరంపై దద్దుర్లు వచ్చినట్టుగా వైద్యులు చెబుతున్నారు.చంద్రబాబును నిన్న రాత్రి, ఇవాళ వైద్యులు పరీక్షించారు. ఇవాళ ఉదయం చంద్రబాబు ఆరోగ్యంపై  వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు అధికారులు. చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ రావడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా   తమ అభిప్రాయాలను  వ్యక్తం చేశారు. 

click me!