పరారీలో కొల్లు రవీంద్ర...ఆచూకీ కోసం గాలిస్తున్న 3 బృందాలు: డిఎస్పీ బాషా

Arun Kumar P   | Asianet News
Published : Jul 03, 2020, 09:22 PM ISTUpdated : Jul 03, 2020, 09:27 PM IST
పరారీలో కొల్లు రవీంద్ర...ఆచూకీ కోసం గాలిస్తున్న 3 బృందాలు: డిఎస్పీ బాషా

సారాంశం

మంత్రి పేర్ని నాని అనుచరుడు, మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో టిడిపి నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం వున్నట్లు ప్రదాన నిందితులు తెలిపారని డిఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు.

విజయవాడ: మంత్రి పేర్ని నాని అనుచరుడు, మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో టిడిపి నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం వున్నట్లు ప్రదాన నిందితులు తెలిపారని డిఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. ఆయన ప్రోద్భలంతోనే ఈ  హత్య చేసినట్లు ప్రధాన నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు డిఎస్పీ వెల్లడించారు. 
 
వైఎస్సార్ సిపి నేత మోకా భాస్కరరావును హత్యచేసిన ప్రధాన నిందితులను ఆర్ పేట పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మొదట ముగ్గురు ఆ తర్వాత మరో ఇద్దరు అరెస్టయినట్లు... మొత్తంగా ఈ హత్య కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

నిందితులిచ్చి వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర పై 302,109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారని... ఆయన లేకపోవడంతో వెనుతిరిగినట్లు తెలిపారు. కొల్లు రవీంద్ర ప్రస్తుతం పరారీలో వున్నారని...ఆయన ఆచూకి కోసం 3 బృందాలను నియమించినట్లు డిఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు. 

read more  వైసిపి నేత హత్యలో కుట్రదారుగా కొల్లు రవీంద్ర... ఉల్లింగిపాలెంలో ఉద్రిక్తత

కొల్లు రవీంద్రను నేడు అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావించినా ఆయన ఆచూకీ లభించలేదు. అయితే ఈ కేసులో ఇప్పటికే  రవీంద్ర అనుచరుడు, టీడీపీ నేత చింతా చిన్నిని ఆర్‌పేట పోలీసులు గురువారమే అరెస్ట్ చేశారు. 

రాజకీయంగా ఆధిక్యత చాటుకునేందుకే భాస్కరరావును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై మరికొందరిని సైతం విచారించే అవకాశ వుంది. గత నెల 29న నడిబొడ్డున అందరూ చూస్తుండగా పట్టపగలు భాస్కరరావును హత్య చేయడం కలకలం రేపింది.

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు టిడిపి నాయకులకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు నిర్థారణకు వచ్చారు. రాష్ట్ర రవాణా, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నానికి భాస్కరరావు ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. 

హత్య చేసిన అనంతరం ఓ నిందితుడు బైక్ పై పరారవుతుండగా సీసీ కెమెరాలకు చిక్కారు. రోడ్డుపై సిద్ధంగా ఉన్న బైక్ ఎక్కి పరారయ్యాడు ఓ నిందితుడు. ఇలా నగరంలోని వివిధ సిసి టివి పుటేజిని సేకరించిన పోలీసులు నలుగురు నిందితులను గుర్తించారు. వీరి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

భాస్కరరావు ఛాతీలో పొడిచిన ఒకే ఒక్క పోటు బలంగా దిగడంతో గుండెకు బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. నేరుగా గుండెకు గాయం కావటంతోనే భాస్కర రావు ప్రాణాలు విడిచారు. 

మంత్రి పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన తొలి నుండి ఆయనతోనే వుంటూ ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నారు భాస్కరరావు. అటువంటి అత్యంత సన్నిహితుడి దారుణ హత్య విషయం తెలుసుకుని మంత్రి చలించిపోయారు. తన హోదాను సైతం మరిచిపోయి బాగా ఎమోషనల్ అయ్యారు

PREV
click me!

Recommended Stories

Manyam Collector Presentation on Mustabu Programme | Chandrababu | Collectors | Asianet News Telugu
Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu