ఏపీ: కొత్తగా 1217 మందికి పాజిటివ్.. 19,98,360కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Aug 21, 2021, 04:44 PM IST
ఏపీ: కొత్తగా 1217 మందికి పాజిటివ్.. 19,98,360కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 1217 కరోనా కేసులు నమోదవ్వగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,535 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,141 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1217 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,98,360కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,715కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో 1, తూర్పుగోదావరి 1, గుంటూరు 3, కృష్ణ 4, ప్రకాశం 3, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,535 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,69,504కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 61,678 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,60,34,217కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,141మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 17, చిత్తూరు 171, తూర్పుగోదావరి 182, గుంటూరు 101, కడప 23, కృష్ణ 136, కర్నూలు 15, నెల్లూరు 198, ప్రకాశం 113, శ్రీకాకుళం 33, విశాఖపట్నం 58, విజయనగరం 47, పశ్చిమ గోదావరిలలో 123 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Health Update: చికిత్స కోసం ముంబై వెళ్లిన పవన్ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?
Cyclone alert: బంగాళాఖాతంలో తుపాను..? ఈ జూలైలో జోరువానలు? | Heavy rains AP | Asianet News Telugu