స్నేహానికి విలువ ఇచ్చి.. తారక్ తోడుగా కొడాలి నాని

Published : Aug 29, 2018, 04:46 PM ISTUpdated : Sep 09, 2018, 01:08 PM IST
స్నేహానికి విలువ ఇచ్చి.. తారక్ తోడుగా కొడాలి నాని

సారాంశం

 వేరు వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ ఈ మిత్రులు కష్టకాలంలో ఒకరికొకరు తోడుగానే ఉంటారని నిరూపించారు. హరికృష్ణ మరణ వార్త తెలుసుకున్న కొడాలి నాని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. 

తారక్, కొడాలి నాని బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్త మిత్రుల్లో కొడాలి నాని మొదటి స్థానంలో ఉంటారనడంలో అతిశయోక్తి లేదేమో. అయితే.. కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలో చేరిన తర్వాత వారిద్దరి మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందని అందరూ భావించారు. కానీ వాటికి ఈ రోజు నాని చెక్ పెట్టారు.

 వేరు వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ ఈ మిత్రులు కష్టకాలంలో ఒకరికొకరు తోడుగానే ఉంటారని నిరూపించారు. హరికృష్ణ మరణ వార్త తెలుసుకున్న కొడాలి నాని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం హైదరాబాద్‌కు భౌతికకాయాన్ని తరలించే సమయంలోనూ ఎన్టీఆర్ వెంటే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఓదార్చారు. హరికృష్ణ భౌతికకాయాన్ని అంబులెన్స్ నుంచి కిందికి దించారు. 

హరికృష్ణ అకాల మరణంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి హరికృష్ణ అని ఆయన చెప్పారు. తనను కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించింది ఆయనేనని, హరికృష్ణ లేనిదే తనకు రాజకీయ జీవితం లేదని కొడాలి నాని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్