కరిచే కుక్క మొరగదు... మొరిగే కుక్క కరవదు..: పవన్ పై కొడాలి నాని సెటైర్లు (వీడియో)

Published : Oct 06, 2023, 02:41 PM IST
కరిచే కుక్క మొరగదు... మొరిగే కుక్క కరవదు..: పవన్ పై కొడాలి నాని సెటైర్లు (వీడియో)

సారాంశం

పవన్ కల్యాణ్, చంద్రబాబు లపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాాఖ్యలు చేసారు. అరిచే కుక్క కరవదు... కరిచే కుక్క అరవదు అంటూ పవన్ ఉద్దేశించి సెటైర్లు వేసారు. 

గుడివాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎప్పుడు ఎవరితో ఎందుకు వుంటారో... ఎవరితో విడిపోతారో పవన్ కే తెలియదంటూ ఎద్దేవా చేసారు. పోటీచేసిన రెండు చోట్లు ఓడిన పవన్ ఇంతలా గంతులేస్తుంటే, ఎగురుతుంటే 150 మందిమున్న మేము ఏం చేయాలన్నారు. అయినా కరిచే కుక్క మొరగదు...మొరిగే కుక్క అరవదు అంటూ పవన్ పై మండిపడ్డారు నాని.

ఇక జనసేన, టిడిపి పొత్తుపైనా నాని స్పందించారు. టిడిపితో కలవబోమని బిజెపి స్పష్టంగా చెబుతోంది... కానీ పవన్ మాత్రం ఎన్టీఏలో వున్నానంటున్నాడు, టిడిపి పొత్తు అంటున్నాడు...ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియాలని మాజీ మంత్రి అన్నారు. 

వీడియో

వైసిపిని పవన్ రూపాయి పావలా అని అంటున్నాడు... అంటే అతనే మా పార్టీకి 125 సీట్లు వస్తాయని ఒప్పుకుంటున్నాడని కొడాలి నాని అన్నారు. ఇక పావలా కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఏర్పాటుచేసుకున్న కూటమికి 25 సీట్లు వస్తాయన్నమాట... ఇదే పవన్ మనసులో మాట అయివుంటుందని కొడాలి నాని ఎద్దేవా చేసారు. 

Read More  ఏపీలో అలజడులకు టిడిపి కుట్రలు...: మంత్రి కారుమూరి సంచలనం

ఇక చంద్రబాబు అరెస్ట్ పై జరుగుతున్న వాదనలపై నాని రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తీసుకోలేదని మాత్రమే ఆయన తరపు వాదిస్తున్నారని అన్నారు. అంటే చంద్రబాబును అవినీతి చేసాడు... కానీ అరెస్ట్ సమయంలో సిఐడి వాళ్ళ గవర్నర్ అనుమతి తీసుకోలేదని అంటున్నారని అన్నారు. ఇదే వాదనను సిబిఐ కోర్టుతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్లు వాదిస్తున్నారని నాని అన్నారు. 

చంద్రబాబు పెద్ద దొంగ... ఆయనను పట్టుకునేందుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని మాజీ మంత్రి అన్నారు. 2004 కు ముందు చంద్రబాబు కేవలం కమీషన్లకు కక్కుర్తి పడేవారని.. కానీ కొడుకు లోకేష్ ఎంటర్ అయ్యాక 100 శాతం అవినీతిమయం అయిపోయాడని అన్నారు.  చంద్రబాబు దొంగ, 420, చీటర్.. తమ డబ్బులు దోచుకున్న ఇతడిని ప్రజలు క్షమించరని మాజీ మంత్రి నాని హెచ్చరించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే