పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కోడలి నాని. పవర్ స్టార్ నుంచి మొదలుకొని పచ్కగె స్టార్ అంటూ రకరకాల పేర్లున్నాయని పవన్ కళ్యాణ్ ని ఎద్దేవా చేసారు.
జగన్ మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడానికి ప్రతిపక్షాల వద్ద ఎటువంటి విషయాలు లేక, నీ కులమేంటి మతమేంటంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. మాట్లాడితే ఇంగ్లీష్ విద్య, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, హిందూ క్రిస్టియన్ ముస్లిం తప్ప ఏమి లేవని అన్నారు.
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, కులాల గురించి మతాల గురించి మాట్లాడను అనే పవన్ కళ్యాణ్ కేవలం వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ప్రసాదం తింటారో తినరో తెలియాలంటే, ఆయనతోపాటు తిరుపతి వెళ్లాలని అన్నారు.
undefined
జగన్ మోహన్ రెడ్డిని ఏమని పిలవాలో 151మంది ఎమ్మెల్యేలను మీటింగ్ పెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి గారిని జగన్ అని పిలవాలా, జగన్ రెడ్డి అని పిలవాలా అని తేల్చుకొని చెప్పమని ఒకాయన అంటున్నారని, పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ అన్నారు.
డిపాజిట్లు కోల్పోయిన తమ పార్టీ అభ్యర్థులతో మీటింగ్ పెట్టుకొని తనను కూడా ఏం పేరుతోనే పిలవమంటారో తమకు చెప్పాలని అన్నారు. పవన్ కళ్యాణ్ తండ్రి కళ్యాణ్ బాబు అని పేరు పెట్టారని, సినిమాల్లోకి రాగానే అన్న చిరంజీవి దాన్ని పవన్ కళ్యాణ్ గా మార్చారని అన్నారు. అభిమానులు పవర్ స్టార్ అని పేరు పెట్టారని, పవన్ ఆక్షన్ చూసి తమ పార్టీ వారు పవన్ నాయుడు అనిపేరు పెట్టారని, పవన్ దురభిమానుల ప్యాకేజీ స్టార్ గా నామకరణం చేశారని, రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా పవన్ డిపాజిట్లు కోల్పోయిన తమ 170 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో మీటింగ్ పెట్టుకొని ఇన్ని పేర్లలో ఏ పేరుతోనే పిలవాలో డిసైడ్ అయ్యి తమకు చెబితే అదే పేరుతోనే పిలుస్తామని అన్నారు.
ఇదే ప్రెస్ మీట్ లో టీడీపీ పై చంద్రబాబుపై, తనపైన విమర్శలు చేసిన దేవినేని ఉమపై తీవ్రస్థాయిలో పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. 23 మంది ఎమ్మెల్యే లను లాక్కుని జగన్ నీ తిట్టించి గతంలో చంద్రబాబు పైశాచిక అనందం పొందారని అన్నారు. దేవినేని అవినాష్ ను తనపైన పోటీ చేయించి చంద్రబాబు తండ్రి లేని పిల్లాడిని మోసం చేశారఅని అన్నారు.
అన్న చస్తే వదినని చంపి దేవినేని ఉమా రాజకీయాల్లోకి వచ్చాడు అని అన్నారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఎందుకు వదిలేశారో చెప్పాలని, వంశీ వదిలేస్తే ఎందుకు విమర్శిస్తున్నారని ఎదురు ప్రశ్నించారు.
దేవినేని నెహ్రూ రామారావు కోసం కష్టపడ్డారని, కేవలము కొడుకు కోసం ఆయన టిడిపి లో చేరారని, అలాంటి వ్యక్తి చనిపొగానే కొడుకుకి కేవలం తెలుగు యువత పదవి ఇచ్చారని, ఇచ్చి తనపై ఓడిపోతారని తెలిసినా కూడా అవినాష్ ను పోటీకి నిలబెట్టారని ఆరోపించారు.
దేవినేని ఉమా అతిగా మాట్లాడుతున్నారని, రా చూసుకుందామని సవాల్ విసురుతున్నారని, ఎక్కడికి రమ్మన్నా రావడానికి తాను సిద్ధంగా ఉన్నన్ని, ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని అన్నారు.
టిడిపి లో సంక్షోభం చంద్రబాబు కొడుకు పప్పు వల్ల వచ్చిందని .... ఆయన రోడ్డు రొలర్లా పార్టీని తొక్కేస్తున్నారని అన్నారు. ఆరోపణలు లేక జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేవినేని ఉమా, యనమల మంత్రులు కాదు బ్రోకర్లు అని, వారు కాంట్రాక్టర్లు నుండి డబ్బులు వసూలు చేసేవారని అన్నారు.