కోడలి నాని ప్రెస్ మీట్: చంద్రబాబు పై నోటికొచ్చిన తిట్లు

By telugu teamFirst Published Nov 16, 2019, 5:05 PM IST
Highlights

ఉదయం దేవినేని ఉమా చేసిన సన్న బియ్యం సన్నాసి కామెంట్ పై కోడలి నాని ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చిన తిట్లతో టీడీపీ పార్టీపై ఆ పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. 

మంత్రి కోడలి నాని టీడీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సాధారణంగానే అగ్రెసివ్ గా ఉండే నాని ఈ సారి మరింత దూకుడు ప్రదర్శిస్తూ టీడీపీ అధినేతపై, ఆ పార్టీ నేతలపై ఘాటుగా విమర్శలు చేసారు. 

తండ్రి లేని అవినాష్ ను చంద్రబాబు మోసం చేసాడని అన్నాడు. తాను అవినాష్ కు ఈ విషయం ముందే చెప్పానని, కానీ గొర్రె కసాయివాడిని నమ్మినట్టు వెళ్లి చంద్రబాబును నమ్మాడని అన్నాడు. అతన్ని జగన్ మోహన్ రెడ్డి ఇంటికెళ్లి ఆహ్వానించలేదని, తనంతట తానే వచ్చి చేరాడని అన్నాడు. 

ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన దేవినేని ఉమను ఉద్దేశిస్తూ తీవ్రమైన విమర్శలు చేసాడు. సన్నబియ్యం ఇస్తానన్న సన్నాసి అని తనను అన్నాడని, తాను సన్న బియ్యం ఇస్తానని  "నీ ** మొగుడికి చెప్పానా "అని ఉమా ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. 

తాము ఇస్తామన్నది నాణ్యమైన బియ్యం అని, అందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. "చంద్రబాబు నాయుడు, ఉమా లాంటి వెధవలు *చ్చు, బోషాణం గాళ్ళు కొన్న తినడానికి పనికి రాణి రీసైకిల్ బియ్యం ఇప్పుడు స్టాకు పది ఉంది" అని అన్నారు. ఆ మొత్తం బియ్యాన్ని జల్లడ పడితే కేవలం ఒక జిల్లాకు మాత్రమే సరిపోయే బియ్యం మాత్రమే తినడానికి అనువుగా ఉందని అన్నారు. 

తాము అధికారంలోకి వచ్చిన కాలం పంట చేతికొచ్చే కాలం కాదని, ఈ సారి కొని వచ్చే సంవత్సరం  మధ్య నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. 

14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎం చేసారని, గుద్ది గుర్రాలకు పళ్ళు తోమారా అప్పుడు అని ఎద్దేవా చేసారు. మాటలు చూసుకొని మాట్లాడాలని, *చ్చా మాటలు మాట్లాడొద్దు *చ్చాగా అని తీవ్ర పదజాలాన్ని వాడారు.  అన్న చచ్చిపోయాక వదినను చంపి ఉమ రాజకీయాల్లోకి వచ్చాడని మండిపడ్డారు. 

చంద్రబాబు గురించి మాట్లాడుతూ, ఇందిరా గాంధీ పిలిచి సీటిస్తే పోటీ చేసాడు, ఎన్టీఆర్ రంగులేసుకునే డ్రామలోడు అని అన్నాడని, ఆ తరువాత అధిష్టానం ఆదేశిస్తే ఎన్టీఆర్ పైన్నే పోటీకి దిగుతానని చెప్పి ఓటమి చవి చూసాడు. వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ అనిపించలేదా? అని కోడలి నాని ఫైర్ అయ్యారు. 

ఆ తరువాత ఎన్టీఆర్ పంచన చేరి పదవులు అనుభవించి ఆయన కూతుర్ని పెళ్లి చేసుకొని ఆయనను వెన్నుపోటు పొడిచారని ఆయన చావుకు కారణమైన *చ్చా గాడు చంద్రబాబని పరుష పదజాలం ఉపయోగించాడు. 

దేవినేని అవినాష్ ను తామేదో చెయ్యిపట్టుకోని పార్టీలోకి లాక్కొచ్చామని అంటున్నారని, అది వాస్తవం కాదని అన్నారు. దేవినేని అవినాష్ తండ్రైన దేవినేని నెహ్రు చంద్రబాబును ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన విషయంలో పాచి బూతులు తిట్టాడని, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారని, జీవిత చరమాంకంలో కొడుక్కోక దారి చూపెట్టడానికి దుష్టుడు, దుర్మార్గుడు అయిన చంద్రబాబును నమ్మి, నాలుగు మెట్లు దిగి టీడీపీలో చేరాడని అన్నాడు. 

నెహ్రు మరణించగానే అవినాష్ ను పక్కకు పెట్టేశారని తెలుగు యువత అధ్యక్షుడు అనే పదవి కట్టబెట్టినట్టు చెబుతున్నారని, అదేమన్నా పెద్ద పదవా అని అన్నారు. దొంగ సర్వే కాగితాలిచ్చి, ఓడిపోతాడని తెలిసినా గుడివాడ పంపించారని, కోట్లు ఖర్చుపెట్టించి ఇప్పుడు పురుగు కన్నా హీనంగా చూస్తున్నారని అన్నాడు. పైనున్న రాజశేఖర్ రెడ్డి గారు, నెహ్రు, ఎన్టీఆర్ లు జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళమని చెబితే వచ్చాడని, అంతే తప్ప తాము చెయ్యిపట్టి తీసుకుని రాలేదని అన్నాడు. 

ధర్మాడి సత్యం కూడా బయటకు తీయలేని పడవను పప్పుగాడైనా లోకేష్ ఎప్పటికైనా ముంచేస్తారని గ్రహించే వంశీ బయటకు వచ్చాడని, దానికి జగన్ మోహన్ రెడ్డికి ఏమిటి సంబంధమని అన్నారు. 

నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళినప్పుడు టీడీపీ సన్నాసులు కనపడలేదా అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వానికి ఉచ్చ పోసుకొని వీరంతా మిన్నకున్నారని అన్నారు. పిచ్చ వాగుడు మాట్లాడొద్దని అన్నారు. 

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, కులాల గురించి మతాల గురించి మాట్లాడాను అనే పవన్ కళ్యాణ్ కేవలం వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ప్రసాదం తింటారో తినరా తెలియాలంటే ఆయనతోపాటు తిరుపతి వెళ్లాలని అన్నారు. 

click me!