13 ఏళ్ళ బాలుడు.. 6 ఏళ్ళ బాలిక.. రైస్ మిల్ దగ్గరకు తీసుకెళ్ళి

Published : Nov 16, 2019, 04:45 PM IST
13 ఏళ్ళ బాలుడు.. 6 ఏళ్ళ బాలిక.. రైస్ మిల్ దగ్గరకు తీసుకెళ్ళి

సారాంశం

కాటికి కాలు చాపిన ముసలి వారి నుంచి కళ్ళు తెరవని పసిపాపల కూడా కామాంధులు విడిచిపెట్డడడం లేదు. తాజాగా 6 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేశారు.ఈ ఘటన పాల్పడ్డా నిందితుడు 13 ఏళ్ళ బాలుడి పై కేసు నమోదు చేశారు పోలీసులు.

కాటికి కాలు చాపిన ముసలి వారి నుంచి కళ్ళు తెరవని పసిపాపల కూడా కామాంధులు విడిచిపెట్డడడం లేదు. తాజాగా 6 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేశారు.
ఈ ఘటన పాల్పడ్డా నిందితుడు 13 ఏళ్ళ బాలుడి పై కేసు నమోదు చేశారు పోలీసులు. 


ప్రసాదం కోసం గుడికి వెళ్లి తిరిగి వస్తున్న ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ సంఘటన సంబంధించి  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పమిడిముక్కల మండలం ఐనపూరు గ్రామానికి చెందిన దూడల సాంబశివరావు కుమార్తె కార్తీకమాసం మొదలైన దగ్గర నుంచి ప్రసాదం  కోసం శివాలయంకు ప్రతి రోజు వెళ్లి వస్తుంది.

 

ఈ క్రమంలో గురువారం సాయంత్రం ప్రసాదానికి వెళ్ళిన పాప తిరిగి రాకపోవడంతో కంగారు పడుతూ తండ్రి సాంబశివరావు సాయంత్రం 6.30 పాప ను వెతుక్కుంటూ వెళ్లాడు.  రైస్ మిల్లు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో పాప  తనుశ్రీ పై అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ళ దూడల ధనుష్ ఉండగా తండ్రి సాంబశివరావు కేకలు  వేసుకుంటూ  పరుగెత్తాడు.

 అతడి అరుపులకు భయపడ్డ  ధనుష్ అక్కడి నుంచి  పారిపోయాడు. తీవ్ర రక్త  రక్త స్రావంతో  ఉన్న  పాపను RMPడాక్టర్ వద్దకు తీసుకు  వెళ్లగా అత్యాచారం  జరిగినట్లు నిర్ధారించాడు. గురువారం రాత్రి పమిడి ముక్కల పోలీసు స్టేషన్ లో బాలిక తండ్రి సాంబశివరావు పిర్యాదు చేశాడు.

 ఈ మేరకు శుక్రవారం ధనుష్ పై IPC 376, పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై G. శ్రీనివాస్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu