ఏలూరులో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు... కూరగాయలమ్మే మహిళ కిడ్నీ తీసుకుని... (వీడియో)

Published : Jun 30, 2023, 11:52 AM ISTUpdated : Jun 30, 2023, 11:58 AM IST
ఏలూరులో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు... కూరగాయలమ్మే మహిళ కిడ్నీ తీసుకుని... (వీడియో)

సారాంశం

అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఓ ముఠా కిడ్నీల దందా చేపడుతున్న వ్యవహారం ఏలూరులో వెలుగుచూసింది.

ఏలూరు : వాళ్లు ఏమీ తెలియని పేదోళ్లు. నిత్యం కష్టాలమధ్యే వారి జీవనం కొనసాగుతుంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు వారివి. అలాంటి పేదలను మాయమాటలతో నమ్మించి వారి శరీర భాగాలతో బిజినెస్ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. పేదోళ్ల అమాయకత్వం, ఆర్థిక కష్టాలే అదునుగా కొందరు దారుణాలకు పాల్పడుతున్నాయి.డబ్బున్నోళ్ళ ప్రాణాలు కాపాడేందుకు పేదలను ప్రాణాలు బలిచ్చేందకూ సిద్దపడుతున్నారు. ఇలా డబ్బులు ఆశచూపిస్తూ  ఓ ముఠా కిడ్నీల దందాకు తెరతీసిన వ్యవహారం ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... ఏలూరు పట్టణం  బావిశెట్టివారిపేటకు చెందిన బూసి అనురాధ వన్ టౌన్ ప్రాంతంలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. పేద కుటుంబానికి చెందిన ఆమె ఆర్థిక కష్టాలను ఓ కిడ్నీ రాకెట్ ముఠా గుర్తించింది. అనురాధకు మాయమాటలు చెబుతూ పరిచయం పెంచుకున్నారు కిడ్నీ రాకెట్ ముఠా సభ్యులు. ఇలా వారిపై అనురాధకు పూర్తిగా నమ్మకం కలిగాక అసలు సంగతి బయటపెట్టారు. 

ప్రాణాపాయ స్థితిలో వున్న ఒకరిని కాపాడేందుకు కిడ్నీ అవసరమని అనురాధు తెలిపారు దుండగులు. కిడ్నీ డొనేట్ చేసినవారికి రూ.7లక్షలు ఇస్తామని చెప్పారు. దీంతో ఈ డబ్బులతో తన ఆర్థిక కష్టాలు తీరతాయని భావించిన అనురాధ కిడ్నీ ఇవ్వడానికి సిద్దపడింది. 2022 ఆమెకు ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నారు. అనంతరం కేవలం రూ.5లక్షలు మాత్రమే ఇచ్చి మోసం చేసింది కిడ్నీ రాకెట్ ముఠా. 

Read More  గిద్దలూరులో దారుణం... కాపీ కొట్టనివ్వలేదని బ్లేడ్ తో ప్రిన్సిపల్ గొంతుకోసిన స్టూడెంట్

ఆపరేషన్ అయి నెలలు గడుస్తున్నా మిగతా రూ.2 లక్షలు ఇవ్వకపోవడంతో మోసపోయానని అనురాధ గ్రహించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిడ్నీ  రాకెట్ ముఠా నుండి తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని బాధిత మహిళ కోరుతోంది.  

వీడియో

ప్రస్తుతం ఈ కిడ్నీ దందాను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టామని...  బాధితురాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఏలూరు పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠా బారిన ఇంకెవరైనా పడ్డారేమోనని తెలుసుకునేందుకు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టినట్లు వన్ టైన్ సీఐ ఆదిప్రసాద్ వెల్లడించారు.

చట్టరిత్యా కిడ్నీ ఆపరేషన్ జరగనట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలా మోసాలకు పాల్పడే ముఠాల బారినపడి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని ప్రజలను పోలీసులు హెచ్చరించారు. 

 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?