చిత్తూరు : బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం ... బొప్పాయి తోటలో శవమై తేలిన చిన్నారి

Siva Kodati |  
Published : Oct 13, 2021, 04:39 PM IST
చిత్తూరు : బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం ... బొప్పాయి తోటలో శవమై తేలిన చిన్నారి

సారాంశం

చిత్తూరు (chittoor) జిల్లా కేవీ పల్లిలో (kv pally) కిడ్నాప్ (kidnap) అయిన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది. చెట్ల పొదల మధ్య బాలుడు తేజస్ రెడ్డి మృతదేహం కనిపించింది. బంధువులే బాలుడిని హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు

చిత్తూరు (chittoor) జిల్లా కేవీ పల్లిలో (kv pally) కిడ్నాప్ (kidnap) అయిన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది. చెట్ల పొదల మధ్య బాలుడు తేజస్ రెడ్డి మృతదేహం కనిపించింది. బంధువులే బాలుడిని హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. చీనేపల్లి పక్కనే వున్న మేకలవారి పల్లెలోని (mekalavaripalli ) అమ్మమ్మ ఇంటికి బయల్దేరిన తేజస్ (tejas reddy) కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా చిన్నారి జాడ దొరక్కపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తేజస్ కోసం తీవ్రంగా గాలించారు. చివరికి పొదల మధ్య బాలుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడ్ని గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. మండలంలోని గేరంపల్లి పంచాయతీ సంకేనిగుట్టపల్లికి చెందిన నాగిరెడ్డి దంపతులు తమ కుమారుడు తేజశ్‌ రెడ్డి(8)ని పీలేరులోని బంధువుల ఇంట్లో వదిలి.. భార్యాభర్తలిద్దరూ ఉపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లారు. ఈ నేపథ్యంలో సోమవారం బాలుడు తన అమ్మమ్మ స్వగ్రామమైన ఎగువమేకలవారి పల్లెకు వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో తేజశ్‌ రెడ్డి తన అమ్మమ్మకు చెప్పి ఆడుకునేందుకని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

ALso Read:నిజామాబాద్‌లో కిడ్నాపైన చిన్నారి: మూడు రోజుల తర్వాత మహారాష్ట్రలో చిక్కిందిలా...

అయితే బాలుడు ఎంతసేపటికీ ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న కమ్మంవారిపల్లె పోలీసులు.. బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని బొప్పాయి పొలంలో తేజస్ రెడ్డి మృతదేహం కనిపించడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu