శ్రీకాకుళంలో అపశృతి: వేదికపై నుండి కిందపడ్డ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు

Published : Oct 13, 2021, 04:29 PM IST
శ్రీకాకుళంలో అపశృతి: వేదికపై నుండి కిందపడ్డ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు

సారాంశం

శ్రీకాకుళంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడులు వేదికపై నుండి కిందపడ్డారు. అచ్చెన్నాయుడు కూర్చొన్న సోఫా వెనక్కి వాలడంతో ఈ ఘటన చోటు చేసుకొంది.

హైదరాబాద్: టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడులు వేదికపై నుండి కిందపడిపోయారు. అయితే ఈ ఘటనలో వీరిద్దరికి ఏమీ కాలేదు. భద్రతా సిబ్బంది ఇద్దరిని పైకి లేపారు. స్వాతంత్ర్య సమరయోధులు gouthu latchanna స్మారక పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం నాడు srikakulam లోని బాపూజీ కళా మందిరంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి  టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే atchannaidu,, శ్రీకాకుళం ఎంపీ rammohan naidu తదితరులు పాల్గొన్నారు.అప్పటికే వేదికపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎంపీ రామ్మోహన్ నాయుడులు కూర్చొన్నారు. రామ్మోహన్ నాయుడు వేదికపై కూర్చొని పోన్ చూసుకొంటున్నాడు. ఈ సమయంలో వేదికపై కి వచ్చిన అచ్చెన్నాయుడు సోఫాలో కూర్చోగానే సోఫా వెనక్కు వాలిపోయింది.  దీంతో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులు కిందపడిపోయారు. 

వెంటనే భద్రతా సిబ్బంది అచ్చెన్నాయుడు, రామ్మోమన్ నాయుడులను పైకి లేపారు. సోఫాతో సహా ఇద్దరిని భద్రతా సిబ్బంది పైకి లేపారుఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు కిందపడగానే పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం షాక్‌కు గురై వారి వైపు చూస్తూ ఉండిపోయారు.  ధర్మాన కృష్ణదాస్ పక్కనే ఉన్న వారు వెంటనే అచ్చెన్నాయుడు వద్దకు వచ్చి పరామర్శించారు.


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్