
నంద్యాల : ఏపీలోని నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంటలో దారుణం ఘటన వెలుగు చూసింది. ఓ నాలుగో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. కొందరు దుండగులు. బాలిక స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కిడ్నాప్ కు ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులు మాస్క్ వేసుకుని వచ్చి.. బాలికకు మత్తుమందు ఇచ్చారు. ఆ తరువాత చేతులు కట్టేసి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
కాగా బాలికకు వెంటనే స్పృహరావడంతో గట్టిగా కేకలు వేసింది. దీంతో కంగారు పడ్డ దుండగులు.. బాలిక మెడకు తాడు బిగించి.. అక్కడే వదిలేసి పారిపోయారు. బాలిక కేకలు విన్న స్థానికులు వెతుక్కుంటూ రాగా.. గొంతుకు తాడు బిగించి, చేతులు కట్టేసి బాలిక కనిపించింది. వెంటనే బాలిక గొంతుకు కట్టిన తాడును తీశాడు. తాడు వల్ల బాలిక గొంతుకు గాయమయ్యింది. ఇంకో అరగంట పాటు బాలిక అలాగే ఉంటే చనిపోయేదని తల్లిదండ్రులు అంటున్నారు.
ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. బాలిక స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఉంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. బాలికనే ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది