మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిడారి శ్రవణ్

By ramya neerukondaFirst Published Nov 14, 2018, 12:26 PM IST
Highlights

ఏపీ కేబినెట్ లో ఇటీవల చోటు దక్కించుకున్న కిడారి శ్రవణ్ బుధవారం ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు

ఏపీ కేబినెట్ లో ఇటీవల చోటు దక్కించుకున్న కిడారి శ్రవణ్ బుధవారం ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇటీవల మావోయిస్టుల దాడిలో మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చిన చంద్రబాబు.. మాట ప్రకారం కిడారి కుమారుడు శ్రవణ్ కి మంత్రివర్గంలో చోటు కల్పించారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  ముందుగా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, 15 గిరిజన రెసిడెన్సీ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుపై నూతన మంత్రి శ్రవణ్ సంతకం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తనకు చాలా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారన్నారు. శాఖాపరంగా గ్రౌండ్ లెవల్ కి వెళ్లి తెలుసుకుంటానని తెలిపారు. గిరిజన సంక్షేమం  కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

click me!
Last Updated Nov 14, 2018, 12:25 PM IST
click me!