సీఎం గారు... ఫస్ట్ తిరుపతిలో మొదలెట్టండి: జగన్‌కు కేతిరెడ్డి లేఖ

By Siva KodatiFirst Published Jun 6, 2019, 8:19 PM IST
Highlights

మద్యపాన నిషేధం మొట్టమొదటిగా తిరుపతి నుంచే మొదలు పెట్టాలంటూ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

మద్యపాన నిషేధం మొట్టమొదటిగా తిరుపతి నుంచే మొదలు పెట్టాలంటూ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. విడతల వారీగా రాష్ట్రంలో అమలు కానున్న మద్యపాన నిషేధంలో భాగంగా మొట్టమొదటిగా తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి వెంటనే చేపట్టాలన్నారు.

గత కొన్నేళ్లుగా అప్పటి ప్రభుత్వాలు తిరుమలలో జరిపిన కుంభకోణాలపై కార్యవర్గం, అధికారులు, కోటల పేరుతో బ్లాక్‌లో ఆర్జిత సేవ టిక్కెట్ల అమ్మకాలు, కోట్ల రూపాయల దోపిడీపై దర్యాప్తు జరిపించాలని కేతిరెడ్డి కోరారు.

శ్రీవారికి కానుకలుగా లభించే ఆభరణాల్లోని విలువైన వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాలు, ముత్యాలు, రత్నాలు వాటికి లెక్కలు లేవంటే చేతులు మారాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ఈ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయాలని.. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించే మూడు బంగారు కిరీటాలు మాయం కావడంపై దర్యాప్తు చేయించాలన్నారు.

గత టీటీడీ పాలకమండలిపై అధికారుల తీరుపై ఆన్‌లైన్‌ సేవల పేరుతో జరిగిన మోసాలు, అసైన్డ్ సేవల పేరుతో జరిపిన క్యాష్ లైన్‌లో జరిగిన మోసాలు, తిరుమల కొండపై దేవుని పేరుతో జరుగుతున్న అన్ని మోసాలు, అక్రమాలపై ఒక కమిషన్‌ను నియమించాలని కేతిరెడ్డి కోరారు.

ప్రస్తుతం ఉన్న అధికారులపై దర్యాప్తు జరిపించి, విజిలెన్స్ అధికారులు కొంతమంది అవినీతి అక్రమాలను, కొండపై ఇష్టరాజ్యంగా విజిలెన్స్ అధికారుల చిరు వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు.

ఆపద మొక్కులవాడు, శ్రీవెంకటేశ్వరుడు తమని ఆదుకుంటాడని భక్తులు కొండపకు వస్తుంటే, దేవుడి నగలు, వజ్రాభరణాలు పోయాయనే ప్రచారం ఇబ్బంది కలిగిస్తోందని సమాచార హక్కు చట్ట పరిధిలో శ్రీవారి ఆలయం లేకపోవడం, ఇంత పెద్ద ధార్మిక సంస్థని సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి .. ముఖ్యమంత్రిని కోరారు. 

click me!