టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టులో అంగళ్లు కేసులో ఊరట దక్కింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.
అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుకు అంగళ్లు కేసులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది..రూ. లక్ష పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నెల 11న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై అదే రోజున ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.
undefined
ఈ నెల 16 వ తేదీ వరకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. మరో వైపు ఈ నెల 12వరకు అంగళ్లు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంగళ్లు కేసులో ఈ నెల 12న ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది. చంద్రబాబు, ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలను విన్నది కోర్టు. తీర్పును రిజర్వ్ చేసింది.ఇవాళ తీర్పును వెల్లడించింది. అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.
ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నీటి పారుదల ప్రాజెక్టులను పరిశీలించేందుకు చంద్రబాబు వెళ్లే సమయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముందుగా నిర్ణయించిన రూట్ లో కాకుండా చంద్రబాబు మరో రూట్ లో వెళ్లడంతోనే ఘర్షణ చోటు చేసుకుందని అప్పట్లో పోలీసులు ఆరోపించారు. అయితే చంద్రబాబు వెళ్లే మార్గంలో వైసీపీ శ్రేణులు లారీని అడ్డుగా పెట్టడంతో ఘర్షణ చోటు చేసుకుందని టీడీపీ శ్రేణులు ప్రకటించాయి.
also read:ఐఆర్ఆర్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట: అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశం
ఈ కేసుపై చంద్రబాబు సహా టీడీపీపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై పలువురు టీడీపీ నేతలకు ముందస్తు, రెగ్యులర్ బెయిళ్లు మంజూరయ్యాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అయితే చంద్రబాబుకు ఈ కేసులో బెయిల్ ఇవ్వవద్దని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.