తిరుమలకు కేసీఆర్: ఘనస్వాగతం పలికిన వైసీపీ ప్రజాప్రతినిధులు

By narsimha lodeFirst Published May 26, 2019, 5:19 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు తిరుమలకు చేరుకొన్నారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు కుటుంబసభ్యులు  ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్లారు.

తిరుపతి: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు తిరుమలకు చేరుకొన్నారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు కుటుంబసభ్యులు  ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్లారు.

ఆదివారం నాడు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబసభ్యులు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. 

సోమవారం నాడు ఉదయం బ్రేక్ దర్శనంలో శ్రీవారిని కేసీఆర్ కుటుంబసభ్యులు కలుసుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకొన్నారు.తిరుమలలో అర్ధరాత్రి కేసీఆర్ బస చేస్తారు. శ్రీవారి దర్శించుకొన్న తర్వాత కేసీఆర్ సోమవారం నాడు ఉదయం 11 గంటలకు తిరిగి హైద్రాబాద్‌కు తిరిగి రానున్నారు.

గతంలో కూడ తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమలకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొక్కులు చెల్లించుకొనేందుకు వెళ్లాడు.  ఆ తర్వాత ఇవాళ మరోసారి వెంకన్నను దర్శించుకొనేందుకు కేసీఆర్ తిరుమలకు చేరుకొన్నారు.
 

click me!