జగన్‌తో భేటీ బాగా జరిగింది, ఏపీకీ సహకరిస్తా: మోడీ

By Siva KodatiFirst Published May 26, 2019, 4:20 PM IST
Highlights

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ పట్ల ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి నుంచి ఆదివారం ఢిల్లీ వెళ్లిన జగన్.. ప్రధానిని కలిశారు. దాదాపు గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని సమస్యలు, విభజన హామీలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం భేటీ వివరాలను ప్రధాని ట్వీట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘ ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నాను’’ అంటూ మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాము. ఆయన పదవీకాలంలో కేంద్రం నుండి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను. pic.twitter.com/g6mvRW3Me4

— Narendra Modi (@narendramodi)
click me!