అప్పు ఎగవేత: బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఆస్తుల జప్తుకు నోటీసులు

By narsimha lodeFirst Published Feb 7, 2020, 10:56 AM IST
Highlights

కరూర్ వైశ్యబ్యాంకు యాజమాన్యం బాలకృష్ణ చిన్నఅల్లుడు శ్రీభరత్‌కు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. 

హైదరాబాద్: సినీ నటుడు,టీడీపీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు  శ్రీభరత్‌కు కరూర్ వైశ్యాబ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు.  ఆస్తులను జప్తు చేయాలని  నోటీసులు జారీ చేసింది బ్యాంకు యాజమాన్యం.

హైద్రాబాద్ ఆబిడ్స్ కు చెందిన కరూర్ వైశ్యబ్యాంకు బ్రాంచ్‌లో   హైద్రాబాద్, భీమిలీకి చెందిన భూములను తాకట్టు పెట్టి రుణం తీసుకొన్నారని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ఈ రుణం చెల్లించాలని కోరినా కూడ స్పందించని కారణంగా ఆస్తులన జప్తు చేయాలని బ్యాంకు యాజమాన్యం నోటీసులు జారీ చేసింది.

Also read:టీడీపీలోకి జూ. ఎన్టీఆర్: బాలయ్య చిన్నల్లుడు భరత్ వ్యాఖ్యలు ఇవీ..

కరూరు వైశ్యబ్యాంకు యాజమాన్యం తమకు రూ. 124.39 కోట్లు వెంటనే చెల్లించాలని శ్రీభరత్‌ను కోరింది.దీంతో ఈ విషయమై సరైన స్పందన రాని కారణంగా   ఆస్తులను జప్తులను  చేయాలని  బ్యాంకు యాజమాన్యం నోటీసులు జారీ చేసింది.
 

click me!