ఆనాడు రూ. 5 వేల కోట్లకు పార్టీ విలీనం.. ఈ రోజేమో.. : చిరుపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

Published : Aug 10, 2023, 06:56 PM ISTUpdated : Aug 10, 2023, 07:09 PM IST
ఆనాడు రూ. 5 వేల కోట్లకు పార్టీ విలీనం.. ఈ రోజేమో.. : చిరుపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.  మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీలో చేరేందుకు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ రాజకీయాలు మెగాస్టార్ చిరంజీవి కేంద్రంగా సాగుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా చిరంజీవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీలో చేరి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా ఉండాలని ఉద్దేశంతోనే మెగాస్టార్ చిరంజీవి లిక్స్ ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీలో చేరబోతున్నారనీ, ఈ విషయాన్ని తాను ముందుగానే ఊహించానని వెల్లడించారు. సిగ్గున్న వారెవరైనా జనసేనలో చేరుతారంటూ ప్రశ్నించారు.

చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రజలను మాయలో పడేస్తున్నారని, మెగా బదర్స్ మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికల తర్వాత జనసేనను బీజేపీలో విలీనం చేయబోతున్నారని, ఇది తథ్యమని అన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ విశాఖలో చేస్తున్న వారాహి యాత్ర కూడా బీజేపీ కోసమేనని విమర్శించారు.

ఈ విషయంలో చిరంజీవి,పవన్ కల్యాణ్, నాగేంద్రబాబులతో చర్చించేందుకు తాను సిద్ధం అంటూ కేఏ పాల్ సవాల్ విసిరారు. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసేందుకు రూ.5 వేల కోట్లు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?