ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం నా అదృష్టం.. సీఎం జగన్

Published : Jun 11, 2019, 03:48 PM ISTUpdated : Jun 11, 2019, 03:51 PM IST
ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం నా అదృష్టం.. సీఎం జగన్

సారాంశం

జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన దివంగత  డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన ర్లమెంట్ ప్రసంగాల సంకలనం 'పెద్దల సభలో తెలుగు పెద్ద' పుస్తకావిష్కరణ కార్యక్రమం తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన దివంగత  డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన ర్లమెంట్ ప్రసంగాల సంకలనం 'పెద్దల సభలో తెలుగు పెద్ద' పుస్తకావిష్కరణ కార్యక్రమం తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజ్యసభ పూర్వ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సేకరించిన సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... సినారె గారు రాసిన పుస్తకాన్ని తన చేతితో ఆవిష్కరించడం తన  అదృష్టమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ముఖ్య అతిథి గా జాతీయ జ్యుడిషియల్ అకాడెమి డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురాం. రైతు నేస్తం పబ్లికేషన్స్ కి చెందిన డాక్టర్ యడ్లవల్లి వేంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : మీరు ఈ వీకెండ్ కూరగాయల మార్కెట్ కు వెళుతున్నారా..? అయితే ధరలెలా ఉన్నాయో తెలుసుకొండి
CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu