కంగారు పడుతున్నట్లున్నారు, అది ప్రభుత్వం తప్పుకాదండీ: జగన్ కు ముద్రగడ లేఖ

By Nagaraju penumalaFirst Published Nov 4, 2019, 11:45 AM IST
Highlights

హామీలు ఇవ్వని కొత్తపథకాలు ప్రజలకు ఇవ్వడం కోసం చాలా తాపత్రాయపడుతున్నారు. అలా తాపత్రాయపడే వాటిలో మాజాతి బీసీ ఎఫ్ రిజర్వేషన్ అంశం లేకపోవడం మాజాతి చేసుకున్న పాపం అంటూ లేఖ రాశారు. 
 

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. సీఎం జగన్ కు అభద్రతా భావం పెరిగిపోయిందని అందువల్లే కంగారు పడుతున్నట్లున్నారంటూ సెటైర్లు వేశారు. 

సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చినహామీలు అమలు చేయడానికి అష్టకష్టాలు పడుతన్న సంగతి లోకానికి తెలుసనంటూ చెప్పుకొచ్చారు. ఈ వరాలే కాకుండా ఎన్నో కొత్తవి ప్రకటించడం వాటి పంపిణీకి తేదీల వారీగా కేలండరు ప్రకటిస్తున్నారని స్పష్టం చేశారు. అయితే నిధుల కోసం భూములు అమ్మకం వార్తలు రావడం కూడా చూశామని దీన్ని బట్టి చూస్తుంటే మీలో అభద్రతా భావం పెరిగి కంగారు పడుతున్నట్లుగా అనిపిస్తోందన్నారు. 

హామీలు ఇవ్వని కొత్తపథకాలు ప్రజలకు ఇవ్వడం కోసం చాలా తాపత్రాయపడుతున్నారు. అలా తాపత్రాయపడే వాటిలో మాజాతి బీసీ ఎఫ్ రిజర్వేషన్ అంశం లేకపోవడం మాజాతి చేసుకున్న పాపం అంటూ లేఖ రాశారు. 

ఇది ప్రస్తావించాల్సిన సందర్భం కాదు గానీ రాష్ట్రంలో ఇసుక గురించి ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం అని చెప్పుకొచ్చారు. అటు వంటి బాధలు మా జాతి రిజర్వేషన్ కోసం అనుభవిస్తున్నందుకు రాయాల్సి వచ్చిందని లేఖలో స్పష్టం చేశారు. 

ఎన్నో సంక్షేమ పథకాలు రూపకల్పన చేయడంలో చాలా చొరవ తీసకుంటున్నారు. కానీ ఎందుచేతో ఇసుక పాలసీ విషయంలో నిర్లక్ష్యం వహించడం భావ్యం కాదని మేధావులలోనూ, ప్రజలలోనూ అనిపిస్తోందన్నారు. 

నదులలో నిత్యం నీరు ఉండే రోజులు, లేని రోజులు ప్రజలకు తెలుసు కానీ నీరు ఉండటం వల్ల ఇసుక కొరత అన్నది ప్రభుత్వ పక్షాన చెప్పడం చాలా తప్పు అని చెప్పుకొచ్చారు.  ఈ ఇసుక ప్రజలకు ప్రకృతి ఇచ్చిన వరం ప్రభుత్వానికి ఎటువంటి పెట్టుబడి లేనిదని చెప్పుకొచ్చారు. 

ప్రజలు సుఖంగా జీవించే లాగ చర్యలు ఉండాలే తప్ప ఓట్లు వేసిన వారిని బాధించడం, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకురావడం మంచిది కాదని తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. తాను పెద్దగా చదువుకోలేదన్న ఆయన తాను మేధాని కూడా కాదన్నారు. ఇషుక గురించి ప్రజలు పడుతున్న బాధలు చూసి ఈ లేఖ రాస్తున్నాట్లు తెలిపారు. 

ఉదాహరణకు 4లైన్ల రోడ్లు ఎప్పుడైనా ఒకవైపు ఆటంకం వస్తే ఆ ఆటంకం తొలగే వరకు ట్రాఫిక్ ఆపకుండా రెండోవైపు మళ్లిస్తారని గుర్త చేశారు. అలా వాడుకున్నంత మాత్రాన ప్రభుత్వం తప్పు చేసినట్లు కాదండీ అంటూ చెప్పుకొచ్చారు. 

అలాగే మీ ఇసుక పాలసీ పగడ్బంధీగా అమలు చేయడానికి కావలసినంత సమయం తీసుకోండి అది అమలు అయ్యే లోపు ప్రకృతి ఇచ్చిన ఇసుకను ప్రజలకు, రెవెన్యూ మైన్స్ పోలీసు మెుదలగు శాఖలు అనుమతి అవసరం లేకుండా ఎవరికి ఎంత కావాలో అంత ఇసుక ఉచితంగా తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం వలన ప్రజలు సుఖపడతారని తాను అభిప్రాయపడుతతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 

దయచేసి తాను రాసిన విషయాలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి లేదు, ప్రజలను కార్యాలయాలు, ఈ సేవలు చుట్టూ తిరిగే పరిస్థితి తేకుండా పక్కా పాలసీ తయారయ్యే వరకు ఉచిత ఇసుక ఆదేశాలు ఇవ్వడం మంచిదనిపిస్తోందని సూచించారు. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా గట్టి బందోబస్తు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని ముద్రగడ పద్మనాభం లేఖలో కోరారు.  

 

ఈ వార్తలు కూడా చదవండి

కాపు కోటా: చంద్రబాబుకు వైఎస్ జగన్ కౌంటర్ వ్యూహం

అయ్యా జగన్.. షర్మిలకి జరిగినట్లే, నాకూ జరుగుతోంది: ముద్రగడ

నోటికి ప్లాస్టర్ వేసుకుంటా: జగన్‌కు ముద్రగడ ఘాటు లేఖ

click me!