టీడీపీ మాతో ఉంటూనే రాహుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది:కన్నా

First Published 10, Sep 2018, 2:17 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఏపీ టీడీపీ మాతో ఉంటూనే రాహుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఏపీ టీడీపీ మాతో ఉంటూనే రాహుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పలు అంశాల్లో మద్దతుగా నిలబడిందని  అన్నారు.

కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశమని.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్టీఆర్ సిద్ధాంతాలను హత్య చేశారని కన్నా విమర్శించారు. టీడీపీ తెలుగు డ్రామా కంపెనీగా మారిందని తెలుగు ప్రజలు గుర్తించాలన్నారు. ఈ నెల 20న బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమై.. భవిష్యత్ కార్యాచరపై చర్చిస్తామన్నారు.. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏపీ రాజకీయ వ్యవహారాలపై చర్చించామని లక్ష్మీనారాయణ తెలిపారు.

Last Updated 19, Sep 2018, 9:20 AM IST