సైకిలెక్కేందుకు సిద్ధమంటున్న మాజీ ఎమ్మెల్యే

By ramya neerukondaFirst Published 10, Sep 2018, 12:49 PM IST
Highlights

ఆ పార్టీలో సీనియార్టీకి తగిన గుర్తింపు లభించకపోవడంతో ఆయన టీడీపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రి కళా వెంకటరావుతో ఉన్న బంధుత్వంతో త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎన్నికలు దగ్గరపుడుతున్న కొద్ది వలసలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు టీడీపీలో చేరగా.. మరో మాజీ ఎమ్మెల్యే పచ్చకండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

శ్రీకాకుళం జిల్లా లో ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో మాజీమంత్రి కోండ్రు మురళిమోహన్‌ చేరగా, అదేబాటలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు పయనించనున్నారా? అంటే.. ఆయన సన్నిహిత వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. 2009లో కాంగ్రెస్‌ తరఫున ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు. ఆ పార్టీలో సీనియార్టీకి తగిన గుర్తింపు లభించకపోవడంతో ఆయన టీడీపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రి కళా వెంకటరావుతో ఉన్న బంధుత్వంతో త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Last Updated 19, Sep 2018, 9:18 AM IST