కడపలో కన్నాకి దిమ్మతిరిగే షాక్

Published : Jul 07, 2018, 04:27 PM IST
కడపలో కన్నాకి దిమ్మతిరిగే షాక్

సారాంశం

ఇటీవల నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయనపై చెప్పు విసిరేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ ఘటనలు మరువక ముందే కన్నా కడప జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది.కడప జిల్లాలో పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఒంటిమిట్ట లో పర్యటించాలనుకున్నారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు ఊహించని షాక్ తగిలింది. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన రాయలసీమలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన శనివారం కడప జిల్లాలో పర్యటించారు.

ఈ పర్యటన నేపథ్యంలోనే ఆయన ఇటీవల నెల్లూరులో పర్యటిస్తుండగా.. ఆయనపై ఓ వ్యక్తి చెప్పు విసిరేందుకు ప్రయత్నించాడు. ఆ ఘటన నుంచి కన్నా ఇంకా తేరుకోకముందే ఇంకో షాక్ తగిలింది.

కడప జిల్లాలో పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఒంటిమిట్ట లో పర్యటించాలనుకున్నారు. అంతేకాకుండా రాజంపేట నుంచి ర్యాలీ నిర్వహించాలనుకున్నారు. కానీ.. ఆయనకు స్వాగతం పలకడానికి కూడా ఒక్కరు కూడా అక్కడికి రాకపోవడం గనమార్హం. 

ఈ సమాచారం ఆయనకు అందింది. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. ఇక చేసేది ఏమిలేక ఒంటిమిట్ట కార్యక్రమాన్ని రద్దు చేసుకుని నేరుగా రాజంపేటకు వెళ్లారు. కొసమెరుపు ఏంటంటే కన్నా రాక సందర్భంగా కార్యకర్తలను తరలించేందుకు నేతలు రెండు బస్సులను ఏర్పాటు చేశారు. చివరకు బస్సులో ఒక్కరంటే ఒక్కరు ఎక్కలేదు. ఈ రెండు బస్సులు ఖాళీగా కన్నా వెంట వెళ్లాయి

PREV
click me!

Recommended Stories

Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే