కందుకూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Arun Kumar PFirst Published Mar 21, 2024, 10:05 PM IST
Highlights

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆసక్తికర రాజకీయాలు సాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కందుకూరు ఒకటి.  ఇక్కడ మానుగుంట మహేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.  1989 నుండి 2024 వరకు మానుగుంట నాలుగుసార్లు (మూడుసార్లు కాంగ్రెస్, ఓసారి వైసిపి) ఎమ్మెల్యేగా పనిచేసారు. మరోసారి అధికార వైసిపి అలాంటి నాయకున్ని కాదని వైసిపి మరో అభ్యర్థిని కందుకూరు పోటీలో నిలిపింది. దీంతో   ఈసారి ప్రజాతీర్పు ఎలా వుంటుందన్నది    ఆసక్తికరంగా మారింది. 

కందుకూరు రాజకీయాలు :

కందుకూరు నియోజకవర్గంలో  మొదట కాంగ్రెస్ బలంగా వుండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సమీకరణలు మారిపోవడంతో  కందుకూరులో  కాంగ్రెస్ కనుమరుగై వైసిపి బలం పుంజుకుంది. ఇలా వైసిపి గత రెండు (2014, 2019) విజయం సాధించింది.  

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మానుగుంట మహీధర్ రెడ్డికి కందుకూరులో మంచి గుర్తింపు వుంది. ఆయన 1989లో మొదటిసారి కాంగ్రెస్ నుండి పోటిచేసి గెలిచారు. ఆ తర్వాత  2004, 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. ఆ తర్వాత వైసిపిలో చేరిన ఆయన 2019లో మరోసారి కందుకూరులో పోటీచేసి గెలిచారు. 2014 లో టిడిపి హవా కొనసాగినా కందుకూరులో మాత్రం వైసిపి అభ్యర్థి పోతుల రామారావు గెలిచారు.  

ఇక కందుకూరులో కేవలం రెండసార్లు మాత్రమే టిడిపి ఎమ్మెల్యే సీటు దక్కించుకుంది.  1994, 1999 ఎన్నికల్లో దివి శివరామ్ టిడిపి నుండి పోటీచేసి గెలిచారు. అంతకు ముందుగానీ, ఆ తర్వాత గానీ కందుకూరులో టిడిపి గెలిచిందిలేదు.   
 
కందుకూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. లింగసముద్రం
2. వోలేటివారి పాలెం
3.  గుడ్లూరు
4. ఉలవపాడు
5.  కందుకూరు 

కందుకూరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,18,961

పురుషులు -   1,09,029
మహిళలు ‌-    1,09,908

కందుకూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని వైసిపి పక్కనబెట్టింది. నాలుగుసార్లుగా కందుకూరును గెలుచుకుంటూ వచ్చిన నాయకున్ని కాదని మరో నియోజకవర్గం నుండి తీసుకువచ్చిమరీ బుర్రా మధుసూదన్  యాదవ్ ను పోటీ చేయిస్తోంది. 

టిడిపి అభ్యర్థి :

కందుకూరులో ఈసారి ఎలాగైనా పసుపు జెండా ఎగరేయాలన్న పట్టుదలతో టిడిపి వుంది. అందువల్లే టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావును బరిలోకి  దింపారు.  

కందుకూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

కందుకూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,96,510 (89 శాతం)

వైసిపి - మానుగుంట మహీధర్ రెడ్డి - 1,01,275 ఓట్లు (51 శాతం) - 14,936 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి- పోతుల రామారావు - 86,339 ఓట్లు (44 శాతం) - ఓటమి

కందుకూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,73,113 (88 శాతం) 

వైసిపి - పోతుల రామారావు- 84,538 (48 శాతం) ‌- 3,806 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - దివి శివరామ్ - 80,732 (46 శాతం) ఓటమి

click me!