జగన్ కి షాక్.. టీడీపీలోకి మరో కీలకనేత

Published : Sep 12, 2018, 11:05 AM ISTUpdated : Sep 19, 2018, 09:23 AM IST
జగన్ కి షాక్.. టీడీపీలోకి మరో కీలకనేత

సారాంశం

మంగళవారం మధ్యాహ్నం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారని టీడీపీ వర్గాల సమాచారం. టీడీపీలో చేరిక అంశాన్ని బాబు వద్ద సునీల్‌ ప్రస్తావించారని, ఆ మేరకు అక్టోబరు 2న సీఎం చంద్రబాబు సమక్షంలో అమరావతిలో పార్టీలోకి చేరనున్నారని చెబుతున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో... వలసలు పెరిగిపోయాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతలు జంప్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీలే ప్రధాన పార్టీలు కావడంతో.. ఈ రెండు పార్టీలలో చేరే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.

తాజాగా.. మరో నేత సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో మొన్నటి దాకా కీలక బాధ్యతలు చేపట్టిన ఓ నేత ఇప్పుడు.. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారు. అక్టోబరు రెండో తేదీన వైసీపీ నేత చెలమలశెట్టి సునీల్‌ టీడీపీలోకి చేరుతున్నారని తెలిసింది. ఆయనను వైసీపీ కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆ పార్టీ అధిష్ఠానం తప్పించినట్టు సమాచారం. 

మంగళవారం మధ్యాహ్నం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారని టీడీపీ వర్గాల సమాచారం. టీడీపీలో చేరిక అంశాన్ని బాబు వద్ద సునీల్‌ ప్రస్తావించారని, ఆ మేరకు అక్టోబరు 2న సీఎం చంద్రబాబు సమక్షంలో అమరావతిలో పార్టీలోకి చేరనున్నారని చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం