వైఎస్ వివేకా హత్య కేసు: కొలిక్కి వస్తున్న దశలో కడప ఎస్పీ బదిలీ

By telugu teamFirst Published Sep 28, 2019, 11:58 AM IST
Highlights

వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కొలిక్కి వస్తున్న దశలో కడప ఎస్పీ అభిషేక్ మహంతి సెలవుపై వెళ్లారు. దాని ప్రభావం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో కడప ఎస్పీ అభిషేక్ మహంతి సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో కడ ఎస్పీగా కేకెఎన్ అన్బురాజన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

అంతకు ముందు కడప ఎస్పీగా పనిచేసిన మహంతిని 2019 ఫిబ్రవరి 3వ తేదీన అప్పటి ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రాహుల్ దేవ్ శర్మ ఎస్పీగా వచ్చారు. ఆ సమయంలోనే వైఎస్ వివేకాంద రెడ్డి హత్య జరిగింది. వైఎస్ వివేకా హత్యపై నిష్పాక్షిక విచారణకు ఎస్పీని బదిలీ చేయాలని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు ేచసింది. 

వైసిపి విజ్ఞప్తి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రాహుల్ దేవ్ శర్మను బదలి చేసింది. దాంతో మరోసారి కడప ఎస్పీగా మహంతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు ఏర్పాటైన సిట్ కు ఆయన నేతృత్వం వహించారు. కడప ఎస్పిగా వచ్చిన తర్వాత అభిషేక్ మహంతి కేసు  విచారణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

ఇటీవల నలుగురు నిందితులకు నార్కో అనాలిసిస్ టెస్టు కూడా నిర్వహించారు. ఈ పరీక్షల్లో వారు ఏం చెప్పారనే విషయం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే నిందితుల అరెస్టు జరుగుతుందని ప్రచారం సాగింది. ఈ స్థితిలో మహంతి సెలవుపై వెళ్లారు. దాని ప్రభావం వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

click me!