ఇవాళ విచారణకు రాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులను కోరారు.
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులను నాలుగు రోజుల పాటు గడువు కోరారు. ఇవాళ విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులను కోరారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ముందస్తుగా ఖరారైన షెడ్యూల్ కారణంగా తాను ఇవాళ విచారణకు రాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖను పంపారు.
నిన్న కడపకు వైఎస్ అవినాష్ రెడ్డి బయలుదేరిన సమయంలోనే సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు పంపారు. దీంతో అవినాష్ రెడ్డి కడపకు వెళ్లకుండా హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. నిన్ననే తనకు నోటీసులు పంపి ఇవాళ విచారణకు రావాలని కోరడంపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ పంపారు. ముందస్తుగా తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలు ఖరారైనందున ఇవాళ విచారణకు రాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు.
undefined
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున తాను ఇవాళ విచారణకు రాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆన్ లైన్ లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ పంపారు. నాలుగు రోజుల తర్వాత విచారణకు హాజరు కానున్నట్టుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆ లేఖలో తెలిపారు. మరో వైపు వైఎస్ అవినాష్ రెడ్డి రాసిన లేఖపై సీబీఐ అధికారులు ఏం తేల్చారనే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు గడువును ఇచ్చారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది.ఈ విషయమై సీబీఐ అధికారుల నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
also read:రేపు విచారణకు రావాలి: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసు
ఇవాళ ఉదయం పదిన్నర గంటల తర్వాత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైద్రాబాద్ లోని తన నివాసం నుండి బయలుదేరారు. అయితే ఆయన సీబీఐ కార్యాలయానికి వెళ్తారని అంతా భావించారు. కానీ అప్పటికే ఆయన సీబీఐకి విచారణకు రాలేనని లేఖ పంపారు. దీంతో వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి కాకుండా కడపకు బయలుదేరారు.