జ్యోత్స్న మృతి కేసు మిస్టరీ: అప్పుడు పవన్ ఎక్కడ?

By telugu teamFirst Published Apr 17, 2019, 3:45 PM IST
Highlights

జ్యోత్స్న శరీరంపై ఏ విధమైన గాయాల జాడలు కనిపించలేదు. అయితే, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడుతుందని అంటున్నారు. ఆమెపై అఘాయిత్యం చేసి హతమార్చారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

విశాఖపట్నం: బిటెక్ విద్యార్థిని జ్యోత్స్న మృతి కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. జ్యోత్స్న లెక్చరర్ అంకుర్ నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా క్లూస్ లభించే అవకాశం ఉందని భావించారు. అయితే, జ్యోత్స్న ఫోన్ ప్యాటర్న్ లాక్ చేసి ఉంది. దాంతో వివరాలు రాబట్టలేకపోతున్నారు. 

సంఘటనా స్థలంలో పోలీసులకు ఏ విధమైన ఆధారాలు కూడా లభించలేదు. అనుమానితులైన అంకూర్, అతని స్నేహితుడి విషయంలో ఏమీ తేల్చుకోలేని స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో జ్యోత్స్నది హత్యా, ఆత్మహత్యనా అనేది తేల్చుకోవడానికి పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది. 

జ్యోత్స్న శరీరంపై ఏ విధమైన గాయాల జాడలు కనిపించలేదు. అయితే, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడుతుందని అంటున్నారు. ఆమెపై అఘాయిత్యం చేసి హతమార్చారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇది తేలాలన్నా పోస్టుమార్టం నివేదిక రావాల్సిందే. 

జ్యోత్స్న గత 15 రోజులుగా అంకూర్ గదికి ఉదయం 9, 9.30 గంటల మధ్య వచ్చి వెళ్లేదని అంటున్నారు. బీహార్ కు చెందిన అంకూర్ (21) బ్యాచిలర్ కావడంతో ఇలా రావడం సరి కాదని అపార్టుమెంటులో ఉండేవాళ్లు చెప్పారని, కానీ సిలబస్ సందేహాలను తీర్చుకోవడానికి తాను వస్తున్నట్లు వారికి చెప్పిందని అంటున్నారు. 

ఈ నెల 15వ తేదీన జ్యోత్స్న అంకూర్ ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఫ్యాన్ కు ఉరివేసుకుందనేది ప్రస్తుతానికి తెలుస్తున్న విషయం. ఉరి వేసుకున్న విషయాన్ని తాను 3 గంటల సమయంలో పోలీసులకు చెప్పినట్లు అంకూర్ అంటున్నాడు. ఆ రోజు 9 గంటలకు అంకూర్ కోచింగ్ కు వెళ్లాడని, సాయంత్రం 3 గంటలకు వచ్చేసరికి జ్యోత్స్న ఉరేసుకుని కనిపించిందని చెబుతున్నారు 

ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం తీసుకుని ఆమె లోనికి ఎలా వెళ్లిందనేది ప్రశ్న. అయితే, ఆమె వెళ్లేసరికి ఫ్లాట్ లో మరెవరైనా ఉన్నారా అనేది మరో ప్రశ్న. అంకూర్ ట్యూషన్ సెంటర్ లో ఉన్నప్పుడు ఇదే ఫ్లాట్ లో అతనితో పాటు ఉంటున్న పవన్ ఎక్కడున్నాడనేది తెలియడం లేదు. 

జ్యోత్స్న పవన్ ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్లిందా అనేది కూడా తెలియడం లేదు. తాను 3 గంటలకు వచ్చి తలుపు తీసి చూసేసరికి జ్యోత్స్న ఉరివేసుకుని కనిపించిందని అంకూర్ అంటున్నాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు పవన్ కనిపించలేదని సమాచారం. ఆ సమయంలో పవన్ ఎక్కడికి వెళ్లాడనేది తెలియడం లేదు. అంకూర్ తో పాటు పవన్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అనుమానాస్పద మృతి: ప్రేమిస్తున్నానని వెంటపడిందంటున్న లెక్చెరర్

click me!