విశాఖలో గర్భిణీపై దాడి: ఆసుపత్రిలో చికిత్స

By narsimha lodeFirst Published Apr 17, 2019, 1:47 PM IST
Highlights

విశాఖపట్టణం జిల్లాలో రాజేశ్వరీ అనే వివాహితను అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తోంది. 


విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలో రాజేశ్వరీ అనే వివాహితను అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆమెను కారులో ఆసుపత్రికి తరలిస్తూ దాడికి పాల్పడ్డారని బాధితురాలు  చెబుతోంది.

విశాఖ జిల్లాకు చెందిన పెందుర్తిలో రాజేశ్వరీ అనే వివాహితను అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  రూ. 25 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని చెప్పి వేధింపులకు పాల్పడేవారని ఆరోపణలు చేస్తోంది.

ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పి కారులోనే గర్భిణీపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది. రాజేశ్వరీ చేతిపై కోశారని చెబుతుంది. స్థానికుల సహాయంతో భర్త నుండి తప్పించుకొంది.  బాధితురాలు కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
 

click me!