ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా విక్రమ్‌నాథ్

Siva Kodati |  
Published : Apr 10, 2019, 12:34 PM IST
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా విక్రమ్‌నాథ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. ఆయన పేరును ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం నిర్ణయం తీసుకుంది. 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. ఆయన పేరును ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ విక్రమ్‌నాథ్ ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు.

2004 సెప్టెంబర్ 24న అదే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024 సెప్టెంబర్ 23 వరకు విక్రమ్‌నాథ్ సర్వీసులో ఉండనున్నారు.

హైకోర్టు విభజన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన సంవత్సరం తొలి రోజున కార్యకలాపాలు ప్రారంభించింది. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే