టీడీపీలోకి సినీ తార: కండువా కప్పిన చంద్రబాబు

Published : Jan 01, 2019, 07:41 AM IST
టీడీపీలోకి సినీ తార: కండువా కప్పిన చంద్రబాబు

సారాంశం

నవంబర్‌‌లో చంద్రబాబుతో దివ్యవాణి భేటీ అయ్యారు. రాజకీయాల్లో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అవకాశమిస్తే టీడీపీలో చేరి తనవంతుగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆమె చంద్రబాబుతో చెప్పారు. 

అమరావతి: తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు మేటి తారగా వెలిగిన దివ్యవాణి తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో దివ్యవాణి టీడీపీ కండువా కప్పుకున్నారు. 

నవంబర్‌‌లో చంద్రబాబుతో దివ్యవాణి భేటీ అయ్యారు. రాజకీయాల్లో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అవకాశమిస్తే టీడీపీలో చేరి తనవంతుగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆమె చంద్రబాబుతో చెప్పారు. 

దాంతో చంద్రబాబు సోమవారం సాయంత్రం ఆమె టీడీపీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీని గెలిపించడానికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. దివ్యవాణికి అధికార ప్రతినిధి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
 
కాగా, కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్త ఉప్పులేటి దేవీప్రసాద్ కూడా టీడీపిలో చేరారు. సోమవారం సాయంత్రం సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఐటీ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. 

పామర్రు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఉప్పులేటి కల్పన ఆ తర్వాత టీడీపిలో చేరిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్