దిశ ఎఫెక్ట్: ఆడవాళ్ల కోసం జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

By Nagaraju penumalaFirst Published Dec 2, 2019, 6:28 PM IST
Highlights

ఢిల్లీ, ముంబై తరహాలో రాష్ట్రంలో అమలులో ఉన్న జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదును స్టేషన్ తో సంబంధం లేకుండా ఫిర్యాదు తీసుకుని వారిని కాపాడే ప్రయత్నం చేయోచ్చని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. 

విజయవాడ: తెలంగాణ వైద్యురాలు దిశ హత్య ఘటనతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దిశను కాపాడుకోలేకపోయామన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏపీలో అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

ఫిర్యాదులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలు చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు. వారం రోజుల్లో జీరరో ఎప్ఐఆర్ కు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ ట్రైనర్స్ వర్క్ షాప్‌ను ప్రారంభించిన డీజీపీ గౌతం సవాంగ్ జీరో ఎఫ్ఐఆర్ పై కీలక ప్రకటన చేశారు. గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ను ఖచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. 

ఢిల్లీ, ముంబై తరహాలో రాష్ట్రంలో అమలులో ఉన్న జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదును స్టేషన్ తో సంబంధం లేకుండా ఫిర్యాదు తీసుకుని వారిని కాపాడే ప్రయత్నం చేయోచ్చని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. 

జీరో ఎఫ్‌ఐఆర్‌ అమల్లో ఉంటే పోలీసు స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ లోనైనా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. తమ పరిధి కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి అవకాశం ఉండదు. 

జీరో ఎఫ్‌ఐఆర్‌ పేరిట బాధితులు ఏ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా దానిని విచారణకు స్వీకరించి యాక్షన్ స్టార్ట్ చేస్తారు. అనంతరం విచారణ జరిపి సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేస్తారు. 

ఇకపోతే ఈనెల 27 బుధవారం షాద్ నగర్ పీఎస్ పరిధిలో పశువైద్యురాలు దిశ హత్యకు గురైంది. నలుగురు మానవ మృగాలు ఆమెను రేప్ చేసి అత్యంత కృరంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. 

అయితే దిశ అదృశ్యంపై పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తమ పరిధి కాదని తిప్పించడంతో ఆలస్యం అయిపోయింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ పిల్లను కాపాడుకునేవాళ్లమని తల్లిదండ్రులతోపాటు పలువురు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!