
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఏపీ ప్రభుత్వంతో జూడాలు నిర్వహించిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. జూనియర్ వైద్యులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని జూడాలు తెలిపారు.
తమ డిమాండ్లు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఐదు డిమాండ్లను జూడాలు ప్రభుత్వం ముందుంచారు. సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్ పెంపును మాత్రమే ప్రభుత్వం అమలు చేసింది. కొవిడ్ సమయంలో వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ వైద్యులకు ఇన్సెంటివ్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు నష్ట పరిహారం, హెల్త్‌ఇన్సూరెన్స్, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులకు భద్రత, స్టయిపెండ్ నుంచి టీడీఎస్ కోత లేకుండా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూడాలు ఇవాళ్టి నుండి ఓపీ సేవలను నిలిపివేస్తామని ప్రకటించారు. దీంతో జూడాలను ఇవాళ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.
Also Read:ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు
రాష్ట్రంలోని సీనియర్ రెసిడెంట్ వైద్యులకు సూపర్ స్పెపాలిటీ వైద్యులకు స్టయిపెండ్‌ను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెసిడెంట్ స్పెషలిస్ట్ డిగ్రీ వాళ్లకు నెలకు రూ.70 వేలు, రెసిడెంట్ డెంటి్‌స్టలకు రూ.65 వేలు, రెసిడెంట్ సూపర్ స్పెషలి్‌స్టలకు రూ.85 వేలను అందించనున్నారు. పెంచిన స్టయిపెండ్ గతేడాది సెప్టెంబరు నుంచి అమలవుతుంది.