సింహాద్రి రీ రిలీజ్ : బెజవాడలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీభత్సం.. థియేటర్‌లో సీట్లకు నిప్పు

Siva Kodati |  
Published : May 20, 2023, 10:14 PM ISTUpdated : May 20, 2023, 10:17 PM IST
సింహాద్రి రీ రిలీజ్ : బెజవాడలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీభత్సం.. థియేటర్‌లో సీట్లకు నిప్పు

సారాంశం

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో ఆయన అభిమానులు హంగామా సృష్టించారు. ఎన్టీఆర్ అభిమానులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ థియేటర్‌లో సీట్లకు నిప్పు పెట్టారు.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో ఆయన అభిమానులు హంగామా సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. రీ రిలీజ్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సింహాద్రి సినిమాను జూనియర్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. దీనిలో భాగంగా విజయవాడ అప్సర థియేటర్‌లోనూ సింహాద్రిని రిలీజ్ చేశారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. జూనియర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి, బాణాసంచా కాల్చారు.

అయితే సినిమా చూసేందుకు థియేటర్‌లోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ థియేటర్‌లో సీట్లకు నిప్పు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీనిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. 


 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations