ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు

By narsimha lode  |  First Published Jun 7, 2021, 2:44 PM IST

ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీసు ఇచ్చారు.  తమ డిమాండ్ల విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత ఇవ్వకపోతే విధులు బహిష్కరిస్తామని జూడాలు తేల్చి చెప్పారు.
 


అమరావతి: ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీసు ఇచ్చారు.  తమ డిమాండ్ల విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత ఇవ్వకపోతే విధులు బహిష్కరిస్తామని జూడాలు తేల్చి చెప్పారు.ఆరోగ్యభీమా, ఎక్స్‌గ్రేషియా తో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని జూనియర్ డాక్టర్లు కోరాయి. ఈ డిమాండ్లతో సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. 

also read:ఏపీలో ఆందోళన బాటలో జూనియర్ డాక్డర్లు

Latest Videos

కరోనా రోగులకు అందిస్తున్నందున  తమకు కోవిడ్ ప్రోత్సాహకాలను ఇవ్వడంతో పాటు ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 9 న కోవిడ్ తో సంబంధం లేని విధులు, 10న కోవిడ్ విధులు, 12న అత్యవసర విధులను కూడ బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. 

రాష్ట్ర ప్రభుత్వం  వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.  గత మాసంలో తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూడాల డిమాండ్లకు తెలంగాణ సర్కార్ సానుకూలంగా స్పందించింది. దీంతో జూడాలు సమ్మెను విరమించారు. కరోనా సమయంలో జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి దిగితే రోగులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. అయితే  ఈ విషయమై ఏపీ ప్రభుత్వం  ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందో చూడాలి.

click me!