ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By telugu team  |  First Published Jun 7, 2021, 1:21 PM IST

ఆనందయ్య కంట్లో వేసే కె మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుకు తప్ప మిగతా మందుల పంపిణీకి ఇది వరకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఆ మందు కూడా పంపిణీ కానుంది.


అమరావతి: బొనిగె ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుపై విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు తన తీర్పును సోమవారంనాటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ మందుపై సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. 

ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందును కె మందుగా పిలుస్తున్నారు. కంట్లో వేసే చుక్కల మందుకు వెంటనే అనుమతి ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మందును తక్షణమే బాధితులకు పంపిణీ చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. కె మందుపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వం ఆదేశించింది. 

Latest Videos

undefined

కంట్లో వేసే చుక్కల మందుకు మినహా ఆనందయ్య పంపిణీ చేసే మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కంట్లో వేసే చుక్కల మందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆనందయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు కంట్లో వేసే చుక్కల మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఆనందయ్య అందించిన కే మందు శాంపిల్స్ ను ప్రభుత్వానికి సమర్పించారు. దానివల్ల ఏ విధమైన నష్టం లేదని నివేదిక వచ్చింది. దీంతో హైకోర్టు కె మందుకు అనుమతి ఇచ్చింది.

తన మందును బొనిగె ఆనందయ్య మందు పంపిణీని సోమవారం ప్రారంభించారు. ఈ రోజు సోమవారం కేవలం 2 వేల మందికి మాత్రమే కరోనా మందును ఆయన పంపిణీ చేయనున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు నుంచి మందు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. 

ఈ రోజు 5వేల మందికి మందు పంపిణీ చేయాలని అనుకున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. తొలుత సర్వేపల్లి శాసనసభా నియోజకవర్గం ప్రజలకు మాత్రమే మందు పంపిణీ చేస్తారు. గ్రామ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తల ద్వారా ఈ మందు పంపిణీ చేయనున్నారు. 

మరోవైపు తిరుపతిలో వైసీపీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మందును తయారు చేయిస్తున్నారు. ఆనందయ్య కుమారుడి ద్వారా ఈ మందును తయారు చేయిస్తున్నారు. కాగా, కృష్ణపట్నంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. స్థానికేతరులను ఎవరినీ కృష్ణపట్నంలోకి అనుమతించడం లేదు. ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. 

click me!