కర్నూల్‌ ట్రిపుల్ ఐటీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం: విద్యార్ధి సంఘాల ఆందోళన

By narsimha lode  |  First Published May 6, 2022, 10:07 AM IST


కర్నూల్ ట్రిపుల్ ఐటీ కాలేజీలో ర్యాగింగ్ చోటు చేసుకొంది. బీటెక్ ఫస్టియర్ విద్యార్ధిపై ఫైనలియర్ విద్యార్ధి దాడికి దిగాడు. ఈ విషయమై విద్యార్ధి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. అయితే కాలేజీలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని కాలేజీ డైరెక్టర్ సోమయాజులు ప్రకటించారు.


కర్నూల్: కర్నూల్ జిల్లా Triple ఐటీ  కాలేజీలో Ragging కలకలం చోటు చేసుకొంది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ట్రిపుల్ ఐటీ కాలేజీలో ఎలాంటి ర్యాగింగ్ ఘటన చోటు చేసుకోలేదని కాలేజీ డైరెక్టర్ Somayajulu ప్రకటించారు.

బుధవారం నాడు రాత్రి ట్రిపుల్ ఐటీ కాలేజీ క్యాంపస్ లో B.Tech ఫస్టియర్ విద్యార్ధిపై ఫైనలియర్ విద్యార్ధి దాడికి దిగారని ఫస్టియయర్ విద్యార్ధి దాడికి దిగాడు.నమస్తే పెట్టలేదని ఫస్టియర్ విద్యార్ధిపై ఫైనలియర్ విద్యార్ధి దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కాలేజీ డైరెక్టర్ సోమయాజులు ఖండించారు.  పొరపాటున బీటెక్ ఫైనలియర్ Student చేయి ఫస్టియర్ విద్యార్ధికి తగిలిందని సోమయాజులు చెబుతున్నారు.

Latest Videos

ట్రిపుల్ ఐటీ కాలేజీలో ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్ధులపై చర్యలు తీసుకోవాాలని కోరుతూ కాాలేజీ వద్ద విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే కాలేజీలో ర్యాగింగ్ పై కమిటీని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని కూడా కాలేజీ వర్గాలు ప్రకటించాయి.

ఈ ఏడాది మార్చి 25న పశ్చిమ గోదావరి జిల్లా  తాడేపల్లిగూడం నిట్ కాలేజీలో  ర్యాగింగ్ చోటు చేసుకొంది.,  సెకండియర్ విద్యార్ధి జయ కిరణ్ పై సీనియర్లు ర్యాగింగ్ పేరుతో దాడికి పాల్పడ్డారు., ఈ విషయమై  కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు  ఆధారంగా పోలీసులు సీనియర్లను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తాడేపల్లిగూడెం నిట్ క్యాంపస్‌లో దారుణం చోటు చేసుకుంది. సెకండ్ ఇయర్ మెకానికల్ చదువుతున్న యడ్లపల్లి జయకిరణ్ ను థర్డ్, ఫోర్త్ ఇయర్ చదువుతోన్న విద్యార్థులు విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటనపై పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తనను మూడు నెలలుగా  కొందరు సీనియర్లు ర్యాగింగ్‌ చేస్తున్నారని కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 క్యాంపస్‌లో పలు సందర్బాల్లో జయకిరణ్ ను కామెంట్స్ చేయడం, తిట్టడంతో జయకిరణ్ కు  అన్ నోన్ నంబర్ నుంచి వారికి మెసేజ్‌లు పంపించారు. పథకం ప్రకారం జయకిరణ్‌ను సీనియర్లు రూమ్‌కు పిలిపించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి కేబుల్ వైర్ , మగ్గులు, సెల్ ఫోన్లతో విచక్షణా రహితంగా కొట్టారు. రాత్రి 11 నుంచి తెల్లవారే వరకు దాడిచేయటంతో జయకిరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అయితే దాడిసమయంలో ఫోటోలు ,వీడియో లు తీసిన సీనియర్ విద్యార్థులు వాటిని క్యాంపస్ లో  సర్క్యు‌లేట్ చేశారు. 

దీంతో ఈ విషయం  బయటకు వచ్చింది. ఈ ఘటనపై ర్యాగింగ్ యాక్ట్ తో పాటు దాడి, అక్రమనిర్బంధం వంటి సెక్షన్లపై కేసు నమోదు చేశారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకొన్నాయి. రెండు రాష్ట్రాలు కూడ ర్యాగింగ్ పై నిషేధం విధించాయి. ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొంటున్నాయి.

click me!