జొన్నగిరి రైతుకు దొరికిన వజ్రం: రూ. 3 లక్షలకు విక్రయించిన నాగరాజు

By narsimha lodeFirst Published Jul 11, 2021, 10:40 AM IST
Highlights

కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో  నాగరాజు అనే రైతుకు వజ్రం దొరికింది.  ఈ ప్రాంతంలో తరచుగా వజ్రాలు లభ్యమౌతాయి. వజ్రాల కోసం ఇతర రాష్ట్రాల నుండి కూడ వచ్చి అన్వేషిస్తారు. నాగరాజుకు దొరికిన వజ్రాన్ని ఓ వ్యాపారి రూ. 3 లక్షలు చెల్లించాడు. ఒక్క నెలలో ఈ ప్రాంతంలో సుమారు రూ. 5 కోట్ల విలువైన వజ్రాలు దొరికాయి.


కర్నూల్: కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో  నాగరాజు అనే రైతుకు వజ్రం లభించింది. ఈ వజ్రాన్ని వ్యాపారికి నాగరాజు విక్రయించాడు. నాగరాజుకు వ్యాపారి రూ. 3 లక్షలు ఇచ్చాడు. అయితే ఈ వజ్రం విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 12 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.నెల రోజుల్లో జొన్నగిరిలో సుమారు 5 కోట్ల విలువైన వజ్రాలు లభ్యమయ్యాయి. ఈ ప్రాంతంలో ప్రతి ఏటా వర్షాకాలం ఆరంభంలో పంటలు వేసే సమయంలో  వజ్రాల కోసం స్థానికులు వెతుకుతారు.  

నాగరాజు అనే రైతు తన పొలంలో విత్తనాలు వేస్తున్న సమయంలో  వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని అతను వెంటనే  తనకు తెలిసిన వ్యాపారికి విక్రయించాడు. వ్యాపారి నాగరాజుకు రూ. 3 లక్షలు ఇచ్చాడు.అయితే బహిరంగ మార్కెట్ లో దీని విలువ రూ. 12 లక్షలు ఉంటుందని స్థానికులు  చెబుతున్నారు.జొన్నగిరి, తుగ్గలి తదితర ప్రాంతాల్లో తరచుగా వజ్రాలు లభ్యమౌతున్నాయి.  వజ్రాల కోసం స్థానికులతో పాటు కర్ణాటక, అనంతపురం జిల్లాల నుండి కూడ వచ్చి  వెతుకుతారు. ఈ ప్రాంతంలో వజ్రాల కోసం ప్రైవేట్ సంస్థలు కూడ సర్వే నిర్వహిస్తున్నాయి. 

click me!