ప్రమాదాన్ని గుర్తించే పరికరాలు పనిచేయలేదు: స్వర్ణ ప్యాలెస్‌పై కమిటీ నివేదిక..!

By narsimha lode  |  First Published Aug 13, 2020, 1:31 PM IST

అగ్ని ప్రమాదాన్ని గుర్తించే పరికరాలు పనిచేయకపోవడంతోనే స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ సెంటర్ లో 10 మంది మరణించినట్టుగా జేసీ శివశంకర్ కమిటీ అభిప్రాయపడింది.కమిటీ గురువారం నాడు ప్రభుత్వానికి అందజేయనుంది.


అమరావతి: అగ్ని ప్రమాదాన్ని గుర్తించే పరికరాలు పనిచేయకపోవడంతోనే స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ సెంటర్ లో 10 మంది మరణించినట్టుగా జేసీ శివశంకర్ కమిటీ అభిప్రాయపడింది.కమిటీ గురువారం నాడు ప్రభుత్వానికి అందజేయనుంది.

స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో జరిగిన  అగ్ని ప్రమాదంపై  జేసీ శివశంకర్ నేతృత్వంలో కమిటీ నివేదికను సిద్దం చేసింది.ఈ నివేదికను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కు గురువారం నాడు  అందించనున్నారు.

Latest Videos

undefined

ఈ నెల 9వ తేదీన స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. ఈ  ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జేసీ శివశంకర్ కమిటీని ఏర్పాటు చేసింది.

also read:స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం: పరారీలో డాక్టర్ రమేష్, శ్రీనివాస్

ఈ కమిటీ  ఈ ప్రమాదంపై విచారణ నిర్వహించింది. ఫైర్, విద్యుత్, వైద్యంతో పాటు భద్రతపై వేర్వేరుగా రిపోర్టులను సిద్దం చేసింది కమిటీ. స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ కు అనుమతి కోరుతూ రమేష్ ఆసుపత్రి కోరింది. మే 18వ తేదీన ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ ధరఖాస్తు చేసుకొంది. అయితే మే 15వ తేదీ నుండే ఇక్కడ కోవిడ్ సెంటర్ నిర్వహించినట్టుగా కమిటీ గుర్తించింది.

స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ తో పాటు ఇతర కోవిడ్ సెంటర్లకు కూడ అనుమతులు లేవని కూడ కమిటీ నిర్ధారించింది.  స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకొందని కమిటీ అభిప్రాయపడింది. 

భద్రతా ప్రమాణాలు లేకపోయినా కూడ స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ కు అనుమతి ఇచ్చారని కమిటీ గుర్తించినట్టుగా సమాచారం.నివేదికను ఇవాళ కమిటీ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కు అందించనుంది. 
 

click me!