ఐటీ అధికారులకు సెక్యూరిటీ విత్ డ్రా: చంద్రబాబు

Published : Oct 05, 2018, 09:57 PM IST
ఐటీ అధికారులకు సెక్యూరిటీ విత్ డ్రా: చంద్రబాబు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ దాడులు, కేసీఆర్ వ్యాఖ్యలు ఇతర అంశాలపై సమావేశమైన ఏపీ కేబినేట్ సమావేశం వాడీవేడీగా జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు, ఐటీ దాడులపై సమావేశంలో మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే సిద్ధంగా ఉండాలంటూ  చంద్రబాబు మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ దాడులు, కేసీఆర్ వ్యాఖ్యలు ఇతర అంశాలపై సమావేశమైన ఏపీ కేబినేట్ సమావేశం వాడీవేడీగా జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు, ఐటీ దాడులపై సమావేశంలో మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే సిద్ధంగా ఉండాలంటూ  చంద్రబాబు మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రం ఈ దాడులు జరిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. దాడులతో రాష్ట్ర పరువును తీయాలని చూస్తోందంటూ విమర్శించారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనే ఈ తరహా దాడులు చేసేందుకు కేంద్రం స్కెచ్‌ వేసిందంటూ ఆరోపించారు. రాజకీయ దాడులకు సపోర్టు చేసేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై అన్ని స్థాయిల్లో పోరాటానికి సిద్ధంగా ఉండాలని కేబినెట్‌కు సూచించారు.

మరోవైపు లా అండ్‌ ఆర్డర్‌ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్నా చంద్రబాబు నాయుడు ఐటీ దాడుల నేపథ్యంలో ఐటీ అధికారులకు సెక్యూరిటీ విత్‌ డ్రా చేసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బతీస్తున్నారనే అంశపై సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాన్ని పరిశీలించాలని లా సెక్రటరీని చంద్రబాబు ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?