కడప జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి: నేరుగా హైదరాబాద్‌కి ప్రయాణం

Siva Kodati |  
Published : Aug 20, 2020, 06:51 PM IST
కడప జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి: నేరుగా హైదరాబాద్‌కి ప్రయాణం

సారాంశం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. గురువారం సాయంత్రం ఆయన జైలు నుంచి నేరుగా హైదరాబాద్ బయల్దేరారు.

జేసీకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో పీపీఈ కిట్ ధరించి జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఆయన ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ సైతం పీపీఈ కిట్ ధరించి జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

ఈ కేసులో బెయిల్ మీద విడుదలై ఇంటికొస్తుండగా కోవిడ్ 19 నిబంధనల మేరకు వాహనాల ర్యాలీకి ఓ పోలీస్ ఉన్నతాధికారి అనుమతి ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

ఆయన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి మరుసటి రోజే కడప జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కడప జైళ్లో ఉన్న ఖైదీలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా అందులో 317 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో జేసీ ప్రభాకర్  రెడ్డి కూడా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్