జేసీ ప్రభాకర్ రెడ్డి రిమాండ్ పొడిగింపు... బెయిల్ పిటిషన్ వాయిదా

Siva Kodati |  
Published : Jun 26, 2020, 09:04 PM IST
జేసీ ప్రభాకర్ రెడ్డి రిమాండ్ పొడిగింపు... బెయిల్ పిటిషన్ వాయిదా

సారాంశం

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టై ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు కోర్టు రిమాండ్ పొడిగించింది

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టై ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు కోర్టు రిమాండ్ పొడిగించింది.

వీరిద్దరిని పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనంతపురం న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు జూలై 1 దాకా రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read;ఎవరిని విచారిస్తే నిజాలు బయటపడతాయో విచారణలో చెప్పారు: జేసీ లాయర్

మరోవైపు వీరిద్దరికి బెయిల్ ఇవ్వాలంటూ వారి తరపు న్యాయవాదులు అనంత జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే  న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

అలాగే ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను తమ కస్టడీకి అప్పగించాలని తాడిపర్తి పోలీసులు గుత్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై వీరిని విచారించేందుకు అనుమతించాలని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Also Read:ట్రావెల్స్ డాక్యుమెంంట్స్ ఫోర్జరీ కేసు: జేసీకి మరో షాక్

154 బస్సులకు నకిలీ ఎన్ఓసీలు సృష్టించారనే అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను ఈ నెల 13న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. అప్పటి నుంచి వీరిద్దరూ కడప సెంట్రల్ జైలులోనే ఉంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్