జయరాం హత్యకేసులో ట్విస్ట్ : తెలంగాణ పోలీసులకు నిందితులను అప్పగించమన్న జైలు సిబ్బంది..?

By Nagaraju penumalaFirst Published Feb 9, 2019, 6:22 PM IST
Highlights

ఇదంతా ఇలా ఉంటే తాజాగా మరో ట్విస్ట్ నెలకొంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన పీటీ వారెంట్ తో తెలంగాణ పోలీసులు ఏపీకి వెళ్లారు. నందిగామ సబ్ జైలుకి చేరుకున్న వారు నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను కస్టడీకి ఇవ్వాలని కోరారు. అందుకు హైకోర్టు ఇచ్చిన పీటీ వారెంట్ ను చూపించారు. 

హైదరాబాద్: ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జయరాం హత్య కేసులో మేనకోడలు శిఖాచౌదరి పాత్రపై ఏపీ పోలీసులు స్పష్టమైన ప్రకటన వెల్లడించకపోవడం ఒక ట్విస్ట్ అయితే ఆమెనే సూత్రధారి అంటూ జయరాం భార్య పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. 

ఇదంతా ఇలా ఉంటే తాజాగా మరో ట్విస్ట్ నెలకొంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన పీటీ వారెంట్ తో తెలంగాణ పోలీసులు ఏపీకి వెళ్లారు. నందిగామ సబ్ జైలుకి చేరుకున్న వారు నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను కస్టడీకి ఇవ్వాలని కోరారు. అందుకు హైకోర్టు ఇచ్చిన పీటీ వారెంట్ ను చూపించారు. 

తెలంగాణ పోలీసుల అభ్యర్థనను నందిగామ సబ్ జైల్ సిబ్బంది తిరస్కరించినట్లు తెలుస్తోంది. స్థానిక కోర్టు పిటీ వారెంట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ పోలీసులు ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

మరోవైపు లోకల్ కోర్టు ఆశ్రయించే పనిలో తెలంగాణ పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జయరాం హత్య కేసు విచారణపై అతని భార్య పద్మశ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీసుల దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని, ఏపీ ప్రభుత్వం తనకు అన్యాయం చేసిందని ఆరోపించారు. 

తెలంగాణ ప్రభుత్వం అయినా తనకు న్యాయం చెయ్యాలంటూ జయరాం భార్య పద్మశ్రీ తెలంగాణ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త హత్యకేసుపై విచారణ చేపట్టాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

తొలుత పద్మశ్రీ ఇంటికి వెళ్లి సుమారు రెండు గంటలపాటు విచారించారు. జయరాం కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కస్టడీలో తీసుకునేందుకు హై కోర్టు నుంచి పీటీ వారెంట్ తీసుకుని నందిగామ బయలుదేరి వెళ్లారు. నందిగామ సబ్ జైలులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు. అందుకు జైలు సిబ్బంది నిరాకరించినట్లు తెలుస్తోంది.  
 

click me!