స్టూడెంట్స్ యూనిఫాం కలర్ మార్చనున్న ఏపీ ప్రభుత్వం

By telugu news teamFirst Published Apr 27, 2020, 11:33 AM IST
Highlights

ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాల అనగానే.. అందరికీ  తెలుగు, నీలం రంగుల కలయికతో యూనిఫాం గుర్తుకు వచ్చేది. కాగా.. ఇప్పుడు ఈ యూనిఫాం రంగులు మార్చాలని జగన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో నూతన సంస్కరణలు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో..  విద్యా విధానంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా.. తాజాగా.. ఈ విషయంలో జగన్ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. 

ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాల అనగానే.. అందరికీ  తెలుగు, నీలం రంగుల కలయికతో యూనిఫాం గుర్తుకు వచ్చేది. కాగా.. ఇప్పుడు ఈ యూనిఫాం రంగులు మార్చాలని జగన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

వచ్చే ఏడాది నుంచి 6వ తరగతి నుంచి 10 తరగతి విద్యార్థుల యూనిఫాం కలర్ మార్చనున్నట్లు ఏపీ విద్యా శాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలుపు, నీలం, ముదురు నీలం రంగుల బట్టలు ఇస్తుండగా..వ‌చ్చే ఏడాది నుంచి గులాబీ రంగు దుస్తులు ఇవ్వనున్నట్లు తెలిపింది. బాలురకు ప్యాంట్, ష‌ర్ట్… బాలిక‌ల‌కు పంజాబీ డ్రెస్ ఇస్తామని, దుస్తులను ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని పేర్కొంది.

click me!