
కోనసీమ అల్లర్లకు (konaseema violence) సంబంధించి జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు . మంత్రి విశ్వరూప్ (minister viswarup) కూడా బాధితుడేనంటూ పవన్ అన్నారు. కోనసీమ ఘటన జరిగి ఇన్నాళ్లైనా.. ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తనకు తెలిసినంత వరకు మంత్రి విశ్వరూప్ మంచి వ్యక్తేనని .. రాజకీయాల కోసం రెచ్చగొట్టే వ్యక్తి కాదని పవన్ అన్నారు.
వైసీపీ అధికారంలో వున్నంత కాలం పోలవరం పూర్తి కాదని.. కొట్టడం తమ హక్కుగా వైసీపీ భావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలు తగ్గాక కోనసీమలో పర్యటిస్తానని... ఢిల్లీ బీజేపీ నేతలతోనే తనకు సంబంధాలు వున్నాయి కానీ, ఏపీ నేతలతో కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మహానాడు సక్సెస్ అయ్యిందంటున్నారా.. అయితే మంచిదేనని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన బాగుంటే పొత్తుల ప్రస్తావన ఎందుకొస్తుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కొన్ని కులాలను వైసీపీ శత్రువులుగా భావిస్తోందని.. కమ్మ, కాపు, బీసీ, మత్స్యకార కులాలను శత్రువులుగా చూస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
ALso Read:Pawan Kalyan: శత్రువులు ఎక్కడో లేరు ఫ్యాన్స్ రూపంలో... పవన్ కలలకు సమాధి కడుతున్న అభిమానులు..!
మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని కలవనున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం మేరకు నాదెండ్ల మనోహర్ ..డీజీపీ అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాశారు. రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని జనసేన పేర్కొంది. ఈ విషయాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది.