నాదెండ్ల మనోహర్ పార్టీని వదలరు: స్పష్టం చేసిన జనసేన

Siva Kodati |  
Published : Jun 09, 2019, 03:58 PM IST
నాదెండ్ల మనోహర్ పార్టీని వదలరు: స్పష్టం చేసిన జనసేన

సారాంశం

మాజీ స్పీకర్, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ మనోహర్ గత కొంతకాలంగా పార్టీని వీడుతారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది

మాజీ స్పీకర్, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ మనోహర్ గత కొంతకాలంగా పార్టీని వీడుతారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. నాదెండ్ల అమెరికా పర్యటనలో ఉండటం వల్ల సమావేశానికి హాజరుకాలేకపోయారని.. కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయన పార్టీని వీడే ప్రసక్తి లేదని వెల్లడించింది.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో నాదెండ్ల గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ రోజు నుంచి ఆయన మీడియాకు కనిపించకపోవడంతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించి పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశానికి సైతం హాజరుకాలేదు. ఈ క్రమంలో నాదెండ్ల జనసేనకు గుడ్‌బై చెప్పనున్నారని సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu